![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_analysis/chintamaneni-prabhakare194df25-28e1-47e1-b5c2-08ee11fa1136-415x250.jpg)
టీడీపీ కూటమికి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఏలూరులో వైసిపి మూకల హత్యాయత్నం చేసినట్లు కూటమి అనుకూల మీడియాలో ప్రచారం జరుగుతోంది. పక్కా పథకం ప్రకారం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో వాగ్వాదం పెట్టుకున్నారట వైసీపీ నేతలు. ఐరెన్ రాడ్ తో చింతమనేని సహా ఆయన డ్రైవర్, గన్ మెన్ పై వైసిపి అల్లరి మూకలు దాడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ తరునంలోనే... చింతమనేని గన్ మ్యాన్ నుంచి గన్ లాక్కుని ఫైర్ చేయబోయారట వైసిపి అల్లరి మూకలు.
అయితే... టీడీపీ కూటమికి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పినట్లు చెబుతున్నారు. ఈ దాడిలో స్వయంగా పాల్గొన్న దెందులూరు వైసిపి ఇంచార్జీ కొఠారు అబ్బయ్య చౌదరి సహా దాదాపు 25 మంది అల్లరి మూకలు పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతోంది. బుధవారం రాత్రి వట్లురు లో ఒక వివాహానికి హాజరై తిరిగి వస్తున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. డ్రైవర్ ను తిట్టిన సంగతి తెలిసిందే.
వైసిపి ఇంచార్జీ కొఠారు అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్ నే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బండ బూతులు తిట్టారు. అయితే.. ఆ సంఘటన జరిగేలా వైసీపీ ప్లాన్ చేసిందని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఆ సంఘటన జరిగిన తర్వాతే... ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై హత్యాయత్నం జరిగినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.