![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/cmaca5acc0-92bb-4537-ac49-722bca3bc92b-415x250.jpg)
అలాగే ఈ అంశంపై ఆయన అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామితో కూడా చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది . అలాగే కమలహాసన్ కూడా ఈ కూటమిలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి .. అయితే వెంటనే అప్రమత్తమైన ముఖ్యమంత్రి స్టాలిన్ కమల్ కు జూన్ లో ఖాళీ కాబోయే రాజ్యసభ స్థానాల్లో ఒకటి ఇస్తున్నట్లుగా ప్రకటించారు .. లోక్సభ ఎన్నికల సమయంలో కమల్ .. డీఎంకే కూటమికి మద్దతుగా నిలిచారు. అదే విధంగా తమిళనాడు రాజకీయాల్లో అన్నా డీఎంకే కింద స్థాయిలో ఎంతో బలంగా ఉంది .. అలాగే గ్రామస్థాయిలో కూడా మంచి కార్యకర్తల సైన్యం ఉంది .. విజయ్ ఇటీవలే పార్టీ మొదలుపెట్టారు ఆయనకు అభిమాన సంఘాలు తప్ప పార్టీ నిర్మాణం లేదు ..
సినిమా అభిమానులకు రాజకీయ కార్యకర్తలకు ఎంతో తేడా ఉంటుంది .. అభిమానులతో ఎలాంటి ఉపయోగం ఉండదని పీకే చెప్పినట్టుగా తెలుస్తుంది .. ఇక దానికి తగ్గట్టుగా కూటమిగా ఏర్పడేందుకు సిద్ధపడాలని సలహా ఇచ్చినట్టు అంటున్నారు. విజయ్ కూడా తమిళనాడు రాజకీయాలపై పూర్తి అవగాహన ఉంది .. అలాగే ఒంటరిగా ఏదో చేయాలని ఆయన అనుకోవటం లేదని .. అలాగే కూటముగా వెళ్లి విజయం సాధించే రాజకీయాలని ఫాలో అవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది .. అందుకే ఆయన డీఎంకెను మాత్రమే టార్గెట్గా పెట్టుకున్నారు .. అన్నా డీఎంకేను మాత్రం ఆయన ఎక్కడా పల్లెత్తు మాట అనటం లేదు .. సీట్లో దగ్గర తేడాలు రాకుండా చూసుకుంటే కూటమి ఫామ్ అవుతుందని తమిళనాడులో కొత్త ప్రచారం జరుగుతుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఎలాంటి అంచనాలు అందుకుంటారో చూడాలి.