![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/vallabhaneni-vamsi-arrest9e2661fa-469f-4bd6-9fb9-ea50c636e4c1-415x250.jpg)
అలాగే అదే సమయంలో తన పార్టీకి సంబంధించిన మీడియాకు కూడా సమాచారం ఇచ్చారట. ఇక దీంతో వంశీ డ్రెస్ మార్చుకుని బయటకు వచ్చేలోపు సదరు మీడియా సంస్థ ప్రతినిధులు వంశి ఉంటున్న నివాసం వద్దకు చేరుకున్నాయి. అలాగే వంశీని అరెస్టు తీసుకెళ్తున్న సమయంలో వైసీపీకి అనుకూలంగా ఉండే మీడియా ప్రతినిధులను చూసి పోలీసులు షాక్ అయ్యారు .. వంశీ అనుచరులతో పాటు హైదరాబాదులో అందుబాటులో ఉన్న వైసిపి నేతలు రాయదుర్గంలోని వంశీ ఉంటున్న ఫ్లాట్ వద్దకు వచ్చినట్టు తెలుస్తుంది .. క్రమంలో నిబంధనలను ఉలన్గించడంతో ఈ విషయంపై కూడా వంశీ పై కేసు నమోదు చేయాలని పోలీసులు చూస్తున్నట్టు తెలుస్తుంది.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పోలీసు వ్యవస్థను గుప్పట్లో పెట్టుకుని మేనేజ్ చేసి అప్పటి ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసుల పెట్టారని ఆరోపణలు కూడా ఉన్నాయి .. అలాంటిది ఇప్పుడు పోలీసులతోనే ఆట్లాడుతూ వారికి తీవ్ర ఆగ్రహం తప్పించినట్టు తెలుస్తుంది .. ఇలా మొత్తానికి వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకు వస్తున్న పోలీసులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి తర్వాత కోర్టులో హాజరపరచనున్నారు .. సత్య వర్ధన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వంశీ పై ఇప్పటికే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు .. అలాగే వంశీ పై మరిన్ని కేసులు నమోదు అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది.