తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం ఈ స్థలాన్ని అక్కడ ముంతాజ్ హోటల్ కి కేటాయించారు.. ఈ విషయాన్ని వెనక్కి తీసుకోవాలి అంటూ పలువురు హిందువులతో పాటు టీటీడీ భక్తులు కూడా నిరసనలను వ్యక్తం చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా తిరుమల కొండను రక్షించాలి అంటూ కూడా పలు రకాల నినాదాలతో దీక్ష చేపడుతూ ఉండడంతో.. ఈ సెగ ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు వెళ్లేలా చేయాలని ప్లాన్ చేస్తున్నారట..
సనాతన ధర్మం అంటూ ఏదేదో చెబుతున్న పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ప్రశ్నించడం జరుగుతోంది.. ఇందులో భాగంగా సీజ్ ద ముంతాజ్ హోటల్ అండ్ పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను అక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న భక్తులు స్వామీజీలు కూడా పట్టుకొని తెలుపుతున్నారట. తిరుమల తిరుపతి ఏడుకొండల స్వామి కి వెన్నుపోటు పొడుస్తున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. శేషాద్రి పర్వతం అంచున అసాంఘిక కార్యక్రమాలకు అనుమతించడం తప్పు అంటూ చాలామంది ప్లకార్డులు పట్టుకొని మరి ప్రదర్శిస్తున్నారు. ఈ విషయం పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.