![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_analysis/india-today-mood-off-the-nations-cm-ranks6980b278-45ce-45a4-bb0e-56dc6e8f04da-415x250.jpg)
5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నిలవడం విశేషం. అయితే ఎంకే స్టాలిన్, చంద్రబాబు మధ్య కేవలం 0.1 శాతం మాత్రమే తేడా ఉండడం విశేషం. మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో స్థానంలో ఉన్నారనే విషయాన్ని మాత్రం తెలియజేయలేదు. లోక్ సభ ఎన్నికలకు ముందు నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేను పోలిస్తే సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజాధరణ పరంగా 12 శాతం పాయింట్లు భారీగా తగ్గినట్లుగా వెళ్లడైంది. అప్పుడు చేసిన సర్వేలో దాదాపు 51 శాతం మంది సీఎం ఆదిత్యనాథ్ పనిపట్ల సంతృప్తిగా ఉన్నట్లుగా చెప్పడం జరిగింది.
ఇప్పుడు ఆ సంఖ్య 39 శాతానికి పడిపోయింది. కాగా, మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నవ స్థానంలో నిలిచారు అన్న విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. అతనికి ఎన్నో ర్యాంకు వచ్చిందని విషయాన్ని తెలుసుకోవడానికి జనాలు ఆసక్తిని చూపిస్తున్నారు. అతని పేరు ఇందులో లేకపోవడంతో అతని పాలన సరిగ్గా లేకపోవడం వల్లనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ర్యాంకును వెల్లడించలేనట్టుగా సమాచారం అందుతోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పాలనపైన తీవ్రంగా వ్యతిరేకతలు వస్తున్నాయి.
తాను ఇచ్చిన హామీలను నెరవేర్చక పోగా అతని పాలన అస్సలు బాగోలేదని జనాలు విపరీతంగా తిడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆడవాళ్లు కూడా సీఎం అని కనీస మర్యాద లేకుండా నోటికి వచ్చిన బండబూతులను తిడుతున్నట్లు వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డిని తిట్టడంతో అతని పాలన ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవచ్చని జనాలు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన సరిగా లేకపోవడం వల్లనే ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో సీఎం రేవంత్ రెడ్డి స్థానాన్ని వెల్లడించలేదని చర్చించుకుంటున్నారు.