![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/ys-vijayamma-jagan-ysr-family-sharmila-ap5bfe0b13-fc39-4def-81c3-e98c06292988-415x250.jpg)
కడప జిల్లాలోని పది అసెంబ్లీ సీట్లను కూడా సంపాదించుకోలేకపోయింది వైసీపీ పార్టీ. టిడిపి కూటమి కూడా భారీ మెజార్టీతోనే గెలిచింది. దీంతో వైసీపీ పార్టీ ఘోర పరాజయాన్ని మూట కట్టుకోవడం తిరిగి వైసిపి కోలుకోవాలని అందుకు తగ్గట్టుగా చేయాల్సిన పనులన్నీ కూడా పార్టీ నేతలు చేస్తున్నారట. అంతేకాకుండా కొంతమంది నేతలు పార్టీని వదిలి వెళ్లడంతో మరి కొంతమంది చేరడంతో అలా నెట్టుకొస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉండే వారందరూ కూడా వైసిపి పార్టీలోకి వెళ్లేలా కనిపిస్తూ ఉన్నారు.
వైసీపీ పార్టీలో త్వరలోనే ఒక కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత అందులో గౌరవాధ్యక్షురాలు గా ఉన్నటువంటి విజయమ్మ పార్టీ కోసం గతంలో ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనింది.ఆ తర్వాత కొన్ని కారణాల చేత బయటికి వచ్చిన విజయమ్మ.. తెలంగాణలో షర్మిల YSRTP అనే పార్టీని చేపట్టినటువంటి పార్టీకి మద్దతు ఇస్తానంటూ తెలిపి ఆ తర్వాత ఆ పార్టీని కూడా కాంగ్రెస్ లోకి విలీనం చేసింది. ఆ వెంటనే షర్మిల కూడా ఏపీలో ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుంచి జగన్ మీద డైరెక్ట్ గా విమర్శలు చేస్తూనే ఉంది... దీంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది సన్నిహితులు వైసీపీ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేలా చేయాలని మంతనాలు చేస్తున్నారట. దీంతో విజయమ్మకు కూడా ఈసారి ఒక కీలకమైన పదవి అప్పగించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ లండన్ టూర్ లో కూడా ఆమె ఉందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. వైయస్సార్ మిత్రులందరికీ కూడా వైసిపి కుటుంబం కలిసి ఉండేలా మంతనాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.