ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవలే వెన్ను నొప్పితో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అందుకే ఇటీవలే అధికారికంగా సమావేశాలకు తను దూరంగా ఉంటున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగినటువంటి ఈ క్యాబినెట్ మీటింగ్ సమావేశానికి హాజరు కాకపోవడంతో చాలా ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కు జ్వరం, నడినొప్పి వచ్చిందని అధికారికంగా ప్రకటించిన చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసిన కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడలేదని ఏపీ రాజకీయాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.


అయితే ఇలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ తన కుమారుడితో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్లడం అలాగే ఆలయ దర్శనాల కోసం కేరళకు వెళ్లడం మరింత చర్చనీయాంశంగా మారింది. అయితే పవన్ కళ్యాణ్ ను కొచ్చి ఎయిర్ పోర్ట్ లో చురుగ్గా నడుస్తున్న వీడియోలు బయటికి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక్కడే పలు రకాల అనుమానాలకు కూడా దారి తీసినట్లు కనిపిస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు ఫోన్ చేసిన పవన్ కళ్యాణ్ తీయకపోవడానికి కారణం నారా లోకేష్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. నారా లోకేష్ ని ప్రోత్సహిస్తున్న తీరు పైన పవన్ కళ్యాణ్ చాలా అసంతృప్తితో ఉన్నారని ప్రచారం వినిపిస్తోంది.



అలాగే మంత్రుల పనితీరుకు సైతం ర్యాంకు ఇవ్వడంలో కూడా పవన్ కళ్యాణ్ ని తక్కువ చేసి చూపించడం అటు జనసేన కార్యకర్తలకు కూడా నచ్చడం లేదట. ఇప్పటి వరకు అధికారికంగా పవన్ కళ్యాణ్ అసంతృప్తి గురించి ఎక్కడ తెలియజేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే మరొకసారి కూటమిలో చర్చలు కొనసాగేలా కనిపిస్తున్నాయనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి సీఎం చంద్రబాబు ,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య అసలు ఏం జరుగుతుందో చూడాలి మరి. మరి త్వరలోనే డిప్యూటీ సీఎం గా ఏదైనా మాట్లాడుతారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: