భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా అనేక ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్న సంగతి తెలిసే ఉంటుంది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ విధిస్తున్న టారిఫ్‌లపై సుతారంగా మాట్లాడుతూ తనదైన రీతిలో అసహనం వ్యక్తం చేశారు. భారత్ అమెరికాపై విధిస్తున్న అధిక టారిఫ్‌లు వాణిజ్యానికి చాలా ఇబ్బందికరంగా మారుతున్నాయని, భారత్‌లో వస్తువులను విక్రయించడం మాకు చాలా కష్టమవుతుందని అన్నారు. ఈ సందర్భంగా మరో ప్రత్యేకమైన విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు ట్రంప్. అవును, ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్స్‌ విధించే దేశం భారత్‌ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఒకవేళ భారత్ ఈ విషయంలో వెనక్కి తగ్గకపోతే మేము కూడా అదే పద్ధతిని అనుసరించాల్సి వస్తుందని ఈ సందర్భంగా ట్రంప్‌ స్పష్టం చేశారు.

అంతేకాకుండా ట్రంప్ మరో విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు. తాము ఇతర దేశాల నుండి రెసిప్రోకల్‌ సుంకాలను వసూలు చేస్తామని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రిపోర్టర్స్‌ వాణిజ్యం విషయంలో భారత్‌తో కఠినంగా వ్యవహరించిన ఎదల చైనాతో ఎలా పోరాడగలరు? అని ప్రశ్నించగా.. యూఎస్‌ ఎలాంటి దేశన్నైనా ఓడించే స్థితిలో ఉందని ట్రంప్‌ గొప్పలు పోయారు. అయితే ఎవరినీ ఓడించే ఉద్దేశం లేదని కవర్ చేస్తూ మాట్లాడారు. ఇంకా ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం చోటు చేసుకుంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ట్రంప్ 'Our journey Together'  అనే బుక్‌ గిఫ్ట్‌గా అందజేశారు. ఈ బుక్‌పై ఆయన మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్ యూ ఆర్‌ గ్రేట్‌ అని సంతకం చేయడం విశేషం.

అందులో భారత్‌లో పర్యటించిన ఫోటోలను కొన్నింటిని పొందుపరిచారు. అమెరికా పర్యటనలో భాగంగా రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో భారత్‌ తటస్థంగా ఉందని ప్రపంచం అనుకుంటుందని, ఈ సందర్భంగా పుతిన్‌, ట్రంప్‌ చర్చలు జరపడం ఆనందంగా ఉందని అన్నారు. అంతేకాకుండా మోదీ గ్రేట్‌ లీడర్‌ అని ట్రంప్‌ కొనియాడారు. తరువాత మోదీ మాట్లాడుతూ... మిమ్మల్ని వైట్‌హౌస్‌లో చూడటం ఆనందంగా ఉందన్నారు. మీ చారిత్రాత్మక విజయానికి అభినందనలు అని మోడీ తెలిపారు. ముంబై ఉగ్రదాడి నిందితుడిని భారత్‌కు అప్పగిస్తాం అని అమెరికా అధ్యక్షుడు ప్రకటించగా మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో ముంబై ఉగ్రదాడి (2008) కుట్రదారుల్లో ఒకరైన తహవ్వూర్‌ హుస్సేన్‌ను ప్రపంచంలోనే అత్యంత దుర్మార్గులలో ఒకడని చప్పారు. అతడిని న్యాయ విచారణ కోసం ఇండియాకు పంపడానికి హ్యాపీగా ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: