మొన్నటి సాధారణ ఎన్నికలలో తెలుగుదేశం.. బిజెపితో పొత్తు పెట్టుకున్న జనసేన.. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 21 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు.. రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసింది. జనసేన పోటీ చేసిన కాకినాడ, మచిలీపట్నం లోక్సభ సీట్లతో పాటు.. ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలలోనూ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. జనసేన నుంచి నిడదవోలు ఎమ్మెల్యే కందులు దుర్గేష్, తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌తో పాటు.. పిఠాపురం నుంచి గెలిచిన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు మాత్రమే మంత్రి పదవులు దక్కాయి. ఇక పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును కూడా ఎమ్మెల్సీ చేసి క్యాబినెట్‌లోకి తీసుకుంటారు అంటూ ప్రచారం జరుగుతోంది.


అయితే ఇది ఎప్పుడు జరుగుతుందా.. అని అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఉమ్మడి కృష్ణాజిల్లా మొత్తం మీద జనసేన పోటీ చేసిన ఏకైక నియోజకవర్గం అవనిగడ్డ. అవనిగడ్డ నుంచి మాజీమంత్రి .. రాజకీయాలలో సీనియర్ నేతగా ఉన్న మండలి బుద్ధ ప్రసాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన కాంగ్రెస్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశంలోకి వచ్చి కూడా 2014లో ఎమ్మెల్యేగా గెలిచి 2019లో ఓడిపోయారు. ఇక మొన్న ఎన్నికలకు ముందు జనసేన కండువా కప్పుకుని ఇక్కడ కూడా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కృష్ణా జిల్లాలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన బుద్ధ ప్రసాద్‌కు సీనియర్ నేతగా మంచి పేరు ఉంది.


రాజకీయంగా ఆయన అన్ని పార్టీల వారికి ఆజాతశత్రువుగా ఉంటారు. ఈ క్రమంలోనే తనకు ప్రమోషన్ వస్తుందన్న ఆశలతో ఉన్నట్టు జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వాస్తవానికి బుద్ధ ప్రసాద్ కూడా తనకు మంత్రి పదవి వస్తుందని.. సీనియర్ కొట్టాలో కచ్చితంగా తనకు పదవి ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు. అయితే ఎన్నికలకు ముందు ఆయన టిడిపి నుంచి జనసేనలోకి వచ్చి ఎమ్మెల్యే సీటు దక్కించుకొని విజయం సాధించారు. కందుల‌ దుర్గేష్ జనసేన కోసం ఎప్పటినుంచో పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుద్ధ ప్రసాద్‌కు అవకాశం రాలేదు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రమోషన్ ఇస్తారా.. లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: