![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/duvvada7982a44d-0476-4693-b3f0-dba1ac18251b-415x250.jpg)
కులాంతర , మతాంతర వివాహాలు చేసుకున్న జంటల పై దాడులు జరుగుతున్న క్రమం లో ఏదైనా మంచి సందేశం ఇచ్చేందుకు ఈ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారని అనుకుంటే .. అది డర్టీ పిక్చర్ల ముద్దుల పోటీ గా మార్చేశారు . ఆ ఇంటర్వ్యూ లో ప్రపోస్ డే అంటూ లవ్ ప్రపోజ్ చేసుకున్న తర్వాత ముద్దులు కూడా పెట్టించేసారు . ఒక ప్రజా నాయకుడు అని కూడా ఎలాంటి సిగ్గు మొహమాటం లేకుండా లైవ్ లో ముద్దులు పెట్టుకున్నారు .. ఇంకా మొదటి భార్యతో విడాకులు ప్రక్రియ పూర్తికాక ముందే మరో స్త్రీ తో బహిరంగం గా ముద్దులు పెట్టుకోవడం .. ఇక వాటి కి వాలెంటైన్స్ డే తోక తగిలించడం పట్ల ప్రేమికులు ఈ జంట పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .. ఇక వాలెంటైన్స్ డే కాస్త ముద్దుల రోజు గా మార్చేసి ఎలాంటి సందేశం ఇస్తున్నార ని వీరు పై మండిపడుతున్నారు .. ఒక ఎమ్మెల్సీ గా కొనసాగుతూ ఇలా చేయడం ఏంటని దువ్వాడ ను ప్రశ్నిస్తున్నారు .