మంచు ఫ్యామిలీ వివాదం ఇంకా సద్దుమణిగేలా కనిపించడం లేదు .. ప్రధానంగా మంచు మనోజ్ తన బాధను ఆక్రోసాన్ని విడతల వారీగా వ్యక్తం చేస్తూనే వస్తున్నారు .  ఇక ఇప్పుడు తాజాగా చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నానిని కూడా ఈ వివాదాల్లోకి మనోజ్ లాగడం కొత్త పరిణామాలకు దారితీస్తుంది .. ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని మనోజ్ సరికొత్త డిమాండ్ తెరపైకి తీసుకురావటం ఇప్పుడు మంచి ఫ్యామిలీ గొడవలు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ మరోసారి కుటుంబ వివాదాన్ని ప్రస్తావించారు .. తన తండ్రి పేరుతో ఉన్న యూనివర్సిటీలో హేమాద్రి నాయుడు అనే వ్యక్తి అరాచకానికి పాల్పడుతున్నారని విమర్శ‌లు చేశారు ..


 అలాగే తన వాళ్లను కొట్టి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారని మనోజ్ ఆరోపించారు .. యూనివర్సిటీ పీఆర్వో గాన్న వ్యక్తి ఆడవాళ్లను టార్గెట్ గా చేసుకుని దౌర్జన్యాలు చేస్తున్నట్టు మనోజ్ మండిపడ్డాడు . అలాగే తాను ఆస్తులు కోసం ఈ పోరాటం చేయటలేదని ఆత్మగౌరవం కోసం చేస్తున్నట్లు మనోజ్ చెప్పకు వచ్చారు. తెలంగాణలో తనకు బౌన్స‌ర్లు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు .. కానీ యూనివర్సిటీలో మాత్రం వందలాదిమంది బౌన్సర్లు ఉంటున్నారు ..రాత్రి అయితే చాలు మందు తాగి వారు రచ్చ చేస్తున్నారు ..


ఇక్కడ చదువుకునే విద్యార్థులు భయాందోళనకు గురి చేస్తున్నట్లు మనోజ్ ఆరోపించారు. ఎంబీ యూనివర్సిటీ వద్ద తన వాళ్లపై బౌన్సర్లు కర్ర‌లు రాళ్లతో దాడి చేస్తున్నారని వీటిపై స్థానిక చంద్రగిరి ఎమ్మెల్యే పులివ‌ర్తి నాని జోక్యం చేసుకోవాలని మనోజ్ డిమాండ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది .. స్థానికులకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా పైలివర్తి నాని పై ఉందన్నారు .. అంతే కాకుండా యూనివర్సిటీలో బౌన్స‌ర్లు లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై కూడా ఉందని ఆయన గుర్తుచేయటం ఎప్పుడు హాట్‌ టాపిక్ గా మారింది .. ఇక మరి రాబోయే రోజుల్లో మంచి ఫ్యామిలీ గొడవలు మరెన్ని కొత్త పుంతలు తొక్కుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: