![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/apgbs-viras-sysmtomes-viral-minister-satyakuamr-yadhu559988d3-1148-440b-8b78-141e2093749f-415x250.jpg)
అయితే లక్ష మందిలో ఒకరికి మాత్రమే వస్తున్న జిబిఎన్ సిండ్రోమ్ వ్యాధి.. రోగనిరోధక శక్తిని సైతం నశింప చేసేలా చేస్తుందట. అది ఇన్ఫెక్షన్లు వ్యాక్సిన్లు సర్జరీలు చేయించుకున్న వారిలో లేకపోతే జన్యుపరంగా కూడా జిబిఎన్ వ్యాధి వచ్చే అవకాశం ఉందంటూ వైద్యులు వెల్లడిస్తున్నారు.. ఇది కండరాల బలహీనత, అలాగే శ్వాస ఆడకపోవడం, నడవలేకపోవడం, తిమ్మిరి వంటి లక్షణాలతో ఈ వ్యాధి కనిపిస్తుందట. అయితే ఈ వ్యాధి సోకిన వారు సైతం వెంటనే వినస్ ఇమ్యునో గ్లోబిన్ ఇంజక్షన్ ని వేయించుకోవాలంటూ వైద్యుల సైతం తెలియజేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 8000 వ్యాక్సిన్ లను సైతం అందుబాటులో ఉంచినట్లుగా అధికారులు కూడా తెలియజేస్తున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగానే రాష్ట్ర ప్రభుత్వం వీటిని అందిస్తుందని ఇకమీదట ఎవరైనా జిబిఎన్ బాధితులు ఆందోళన పడవలసిన పనిలేదు అంటూ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలియజేశారు. ఈ ఇన్ఫెక్షన్ తీసుకుంటే 80 శాతం వరకు రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది అంటే వెల్లడించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఒకవైపు బర్డ్ ఫ్లూ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడమే కాకుండా ఇప్పుడు తాజాగా GBS కేసులు నమోదు అవుతున్నాయని తెలిసి ప్రజలు కూడా కొంతమేరకు భయభ్రాంతులకు గురవుతున్నారు.