![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/andhra-pradesh-toll-incomeea346443-689e-4d9c-baef-87069a22fac3-415x250.jpg)
ఇందులో ఇప్పటికే 70 వేల కోట్ల నుంచి 80 వేల కోట్ల రూపాయల విలువైన రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. మరో రెండు లక్షల కోట్ల రూపాయల మేర రోడ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇదంతా ఒక ఎత్తైతే, ఈ హైవేలపై టోల్ గేట్ల ద్వారా వస్తున్న ఆదాయం గురించి కేంద్రం తాజాగా విడుదల చేసిన లెక్కలు దిమ్మతిరిగేలా చేస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన డేటా ప్రకారం, గత ఐదేళ్లలో అంటే 2019-20 నుంచి 2023-24 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లోని జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల ద్వారా వసూలైన మొత్తం అక్షరాలా రూ.13,020 కోట్లు. ఈ లెక్కలు స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. మరింత షాకింగ్ విషయం ఏంటంటే, ప్రస్తుతం ఏపీలో 72 టోల్ ప్లాజాలు ఉండగా, గత మూడేళ్లలోనే ఏకంగా 20 కొత్త టోల్ గేట్లు ఏర్పాటయ్యాయట. అంటే టోల్ గేట్ల సంఖ్య పెరుగుతోంది, ఆదాయం మరింత పెరుగుతోంది.
ఇప్పుడు చెప్పండి, ఏపీలో టోల్ ఆదాయం తక్కువంటారా? కేంద్రం పెట్టిన పెట్టుబడికి, తిరిగి వస్తున్న రాబడికి ఏ మాత్రం సంబంధం లేదనగలరా? ఇది కాసుల వర్షం కురిపించే గోల్డ్ మైన్ కాదా? అని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ లెక్కలతో ప్రతిపక్షాల నోళ్లు కూడా మూతపడ్డాయని చెప్పవచ్చు. మళ్లీ ఈ విషయంలో అబద్ధాలు చెప్పే అవకాశం లేకుండా పోయింది.