![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_analysis/jc-prabhakar-reddy853773e7-25c6-4b3f-99b4-331cfba0f0e9-415x250.jpg)
సినీ నటి మాధవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పై కేసు నమోదు చేశారు పోలీసులు. తన పైన... జేసీ ప్రభాకర్ రెడ్డి అసభ్యకరంగా మాట్లాడాడని... సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది సినీనటి మాధవి. అయితే దీనిపై పూర్తిగా విచారణ చేసి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పై కేసు బుక్ చేశారు పోలీసులు. సినీనటి మాధవిని ఉద్దేశించి కావాలనేదేశీ ప్రభాకర్ రెడ్డి దూషణలు చేశాడని... సైబరాబాద్ పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు.
అదే సమయంలో మా అసోసియేషన్ సభ్యులకు కూడా సినీ నటి మాధవి ఫిర్యాదు చేసింది. దీంతో మా అసోసియేషన్ సభ్యుల సమాచారం తీసుకున్న సైబరాబాద్ పోలీసులు.... తాజాగా జెసి ప్రభాకర్ రెడ్డి పైన కేసు బుక్ చేశారు. దీంతో ఇప్పుడు... పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే పరిస్థితి జేసీ ప్రభాకర్ రెడ్డికి వచ్చింది. వాస్తవంగా డిసెంబర్ 31, 2024 కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇతన నియోజకవర్గంలో మహిళలతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
అయితే ఆ కార్యక్రమం పై సినీనటి మాధవి అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అలాంటివాడు ఇలాంటి వాడు అంటూ... ఆమె రెచ్చిపోయారు. అయితే సందు దొరికితే చాలు రెచ్చిపోయే జెసి ప్రభాకర్ రెడ్డి... తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి నటి మాధవి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటితో చెప్పరాని బూతులన్నీ మాట్లాడారు జేసి ప్రభాకర్ రెడ్డి. దీంతో చేసి ప్రభాకర్ రెడ్డి అలాగే సినీ నటి మాధవి భాగ్యం... అప్పటినుంచి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయ్. ఇక తాజాగా పోలీస్ స్టేషన్లో కేసు వరకు వచ్చింది వ్యవహారం.