నందమూరి బాలకృష్ణ కీలక ప్రకటన చేశారు. ఏపీ ప్రజలకు ఊరట కల్పించేందుకు సంచలన ప్రకటన చేశారు బాలయ్య. ఏపీలో మరో క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మించబోతున్నట్లు ప్రకటించారు బాలయ్య. ఓవైపు సినిమాలలో హీరోగా నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా చాలా చురుగ్గా ఉంటున్నారు. రాజకీయాలలో తనదైన పాత్ర వహిస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారు. అంతేకాకుండా నందమూరి బాలకృష్ణ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి చైర్మన్ గా కూడా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. తాజాగా క్యాన్సర్ వ్యాధి గ్రస్తులకు నందమూరి బాలకృష్ణ శుభవార్త అందజేశారు.


బసవతారకం ఆసుపత్రిని మరింత విస్తరించనున్నామని తెలియజేశారు. హైదరాబాద్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఆంకాలజీ యూనిట్ ను తాజాగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.... నేడు పీడియాట్రిక్ ఐసీయూ, పీడియాట్రిక్ వార్డును ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని నందమూరి బాలకృష్ణ మాట్లాడారు. క్యాన్సర్ బాధితులు ధైర్యంగా ఉంటే కచ్చితంగా క్యాన్సర్ నుంచి కోలుకుంటారని పేర్కొన్నారు.


ఆసుపత్రి విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని తుళ్లూరులో మరో ఎనిమిది నెలల సమయంలో ఆస్పత్రిని ప్రారంభించనున్నామని బాలకృష్ణ వెల్లడించారు. దీంతో క్యాన్సర్ బాధితులు సంతోషంలో ఉన్నారు. జై బాలకృష్ణ అనే నినాదాలు ప్రపంచం అంతటా మారుమ్రోగుతున్నాయి. నా అభిమానులకు నాకు విడదీయలేని గొప్ప అనుబంధం ఉందని బాలకృష్ణ అన్నారు. కేంద్రానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసాడు. నేను ఎప్పుడూ ఎనర్జీగా ఉంటాను. నేను ఎప్పటికీ కుర్రాడినే. నా వయసు ఎప్పటికీ అయిపోదు అని అన్నారు.


నాకు పద్మభూషణ్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మా నాన్నగారికి భారతరత్న అవార్డుని ఇవ్వాలి. ఇది అన్ని తరాల నుంచి వస్తున్న డిమాండ్ అంటూ నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇదిలా ఉండగా.... నందమూరి బాలకృష్ణ ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు ఓ ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చారు. తనకు వరుసగా నాలుగు హిట్ సినిమాలు అందించిన సంతోషంలో తనకు రెండు కోట్ల విలువైన కారును గిఫ్ట్ గా ఇస్తున్నానని బాలకృష్ణ వెల్లడించారు. తమన్ నాకు తమ్ముడి లాంటి వారని బాలకృష్ణ అన్నారు. బాలకృష్ణ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: