![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/buddha-venkanna-tdp-mlc-ap-ycp286b9ff2-860f-4b2b-9c15-711c0954d6f5-415x250.jpg)
అయితే వంశి అరెస్టు తర్వాత ఎవరనే ప్రశ్నలు ఎదురవగా అందుకు సమాధానంగా.. టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకయ్య ఇలా మాట్లాడుతూ టిడిపి కార్యాలయం పైన దాడి చేసిన కేసులో వంశీని అరెస్టు చేశారని కానీ ఆ కేసులో బాధితుని కిడ్నాప్ చేశారనే విధంగా అభియోగాలను తెరమీదికి వచ్చాయని అందుకే వంశీని అరెస్టు చేశారని తెలిపారు.. అయితే గత ఐదేళ్లలో నమోదైన కేసుల పైన ఎన్నో చర్యలు జరుగుతాయని తెలిపారు. ఇప్పటికే మాజీ ఎంపీ నందిగామ సురేష్, అలాగే మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టు అయ్యారని.. వీరితోపాటుగా మాజీ మంత్రి కొడాలి నాని, పేర్ని నాని, అంబాటి రాంబాబు, వేంపల్లి శ్రీనివాసరావు వంటి వారి పైన కూడా కేసులు నమోదయాయని తెలిపారు.
వీరితోపాటు రాయలసీమలో సీనియర్ నేతగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి తో పాటుగా టీటీడీ లడ్డు కల్తీ పైన ఎవరెవరి పైన ఆరోపణలు వినిపించాయో వారందరినీ కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం కూడా జరుగుతోందని తెలిపారు బుద్ధా వెంకన్న. కొడాలి నాని పైన నమోదైన కేసులో ముందస్తుబేలు మంజూరు అయ్యిందని అలాగే పేర్ని నాని కూడా బియ్యం అక్రమ తరలింపు కేసులు ముందస్తుబేలు దరఖాస్తు చేసుకున్నారని.. అలాగే అంబాటి వేంపల్లి పైన కూడా చాలా తీవ్రమైన కేసులు ఉన్నాయని తెలిపారు.