ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి .. ఒకపక్క వ‌ల్ల‌భ‌నేని వంశి అరెస్ట్ అయిన సమయంలో అటు దెందులూరు నియోజకవర్గం లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి .. టిడిపి నేత  ఎమ్మెల్యే చింతమనేని వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మధ్య రాజకీయం తారస్థాయికి చేరింది .. ఈ క్రమంలోని చింతమనేని ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఈ వ్యవహారం పైన సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే చింతనేని పై సీరియస్ అయ్యారు .. అధికారంలో ఉన్నామని గుర్తుంచుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.. ఇదే స‌మ‌యంలో చింతమ‌నేని చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి.


దెందులూరు లో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు వివాదాస్పదంగా మారాయి .. ఒక వివాహ వేడుకకు హాజరైన దెందులూరు ఎమ్మెల్యే చింతమ‌నేని అక్కడ కారు అడ్డంగా పెట్టటం పైన అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్ పైన విరుచుకుపడ్డారు .. ఆ సమయంలో చింతమనేని చేసిన అనుచిత వ్యాఖ్యలు సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారాయి .. ఇక దాంతో అబ్బ‌య్య చౌదరి మద్దతుదారులు ఎమ్మెల్యే చింతమనేనికి వ్యతిరేకంగా అందోళ‌న‌కు దిగారు .. ఈ ఘటన నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఒకసారి గా సీరియస్ అయ్యారు .. పార్టీ కార్యాలయంలో చంద్రబాబును చింతమ‌నేని కలిశారు .. తాజా ఘటనపై చింతమనేని చంద్రబాబుకు వివరణ ఇచ్చారు.


ఇక చింతమనేని వివరణ విన్న చంద్రబాబు సీరియస్ గా స్పందించారు . తప్పును తప్పు అని చెప్పడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు .. కేవలం బూతులు ఒకటే మార్గం కాదని తీరు మార్చుకోవాలని చంద్రబాబు చింతమనేనికి సూచించారు . ఇదే క్రమంలో చింతమనేని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . దెందులూరు ఘర్షణలో తన తప్పు ఉందని రుజువైతే రాజీనామాకు సిద్ధమని సంచలన ప్రకటన చేశారు .. తన గురించి గంట అరగంట అంటూ మాట్లాడే అంబటి సర్టిఫికెట్ ఇస్తాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. సుకన్య , సంజన సర్టిఫికెట్ పొందిన అంబటి స్థాయి అందరికీ తెలిస‌ని కూడా ఆయన వ్యాఖ్యానించారు .. నోరు ఉంది కదా అని ఆంబోతుల విరుచుకుపడటం ఇక‌నైనా మానుకోవాలని సూచించారు.
 

ఇలా తప్పు లేకుండా రంకులేస్తేనే ప్రజలు కాల్చి పెట్టిన వ‌తలు చూపించుకోలేని దుస్థితిలో వైసిపి నేతలు ఉన్నారని ఎద్దేవా చేశారు . ఒక ప్లాన్ ప్రకారమే తనతో గొడవ పెట్టుకుందామని అబ్బయ్య చౌదరి ట్రాప్ లో తాను పడలేదని చెప్పుకొచ్చారు . అలాగే పోలవరం కాలువ బాధితులకు చెల్లించాల్సిన 6 కోట్లు ఎగ్గోట్టే ప‌నిలో భాగంగానే తనతో గొడవకు ప్లాన్ చేశారని చింతమనేని చెప్పుకొచ్చారు .. అలాగే మాజీ స్పీకర్ కోడల కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని వారిపై నేను కేసు పెడతానని చింతనని చెప్పుకొచ్చారు . అలాగే కోడెల శివప్రసాద్ మరణానికి కారణమైన అంబటి రాంబాబు , జగనల‌ పై ఇప్పుడైనా 306 సెక్షన్ కింద కేసు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: