పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం టిడిపికి సుదూర లక్ష్యం .. ప్రజాస్వామ్యంలో ఏది  ఆశాధ్యం కాదు . కానీ పులివెందులలో గెలవాలంటే మాత్రం ఎన్నో రాజకీయాలు చేయాలి ..ప్రత్యర్థిని బట్టి రాజకీయాలు చేయాలి ఇప్పుడు దానికి తగ్గినట్లుగా ప్రయత్నం చేస్తున్నారు . బీటెక్ రవి ఎన్నికల సన్నాహాలు చేసుకుంటున్నారు .. అయితే ఆయన టార్గెట్ వచ్చే ఎన్నికలు కాదు .. ఉప ఎన్నికలు. పులివెందులకు ఉప ఎన్నికలు వస్తాయని టిడిపి నేతలు అంటున్నారు .. అసెంబ్లీకి హాజరు కాని జగన్ పై నిబంధన ప్రకారం అనార్హత వేటు పడుతుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇప్పటికే సంచల ప్రకటన చేశారు ..


అయితే జగన్ మాత్రం తాను వచ్చేది లేదని చేతనైంది చేసుకోండని సవాల్ చేస్తున్నారు . అలాగే అనర్హతా వేటు పడకుండా  ఒక ఆప్షన్ ఉంది .. లీవ్ లెటర్ రాసి స్పీకర్ అనుమతి తీసుకోవటం .. స్పీకర్ అనుమతితో సభకు డుమ్మా కొడితే అనర్హతా  వేటుపడదు కానీ జగన్ అలా లేఖ రాయటం ఆయన మనస్తత్వానికి విరుద్ధమని వైసిపి వర్గాలే అంటున్నాయి. ఇక బీటెక్ రవి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ..  వైసీపీకి బలం ఉన్న గ్రామాల్లో ఏకపక్షంగా ఓట్లు వేసే గ్రామాల్లో కొంతమందిని ఆయన ఆకర్షిస్తున్నారు .. ఎంతకాలం ఒకరికే అధికారం ఇస్తారు మీ గ్రామంలో మీరు పేత్నం చేసే సమయం వచ్చిందని అంటున్నారు .. ఇలా అయినా చాలా గ్రామాల్లో ఏకపక్షంగా ఉండకుండా  పార్టీకి సానుభూతిపరుల్ని పెంచుకుంటున్నారు .. అలాగే నీటి సంఘాల ఎన్నికల్లను అందుకు ఉపయోగించుకున్నారు . అన్ని ప్రాంతాల్లో తమ పార్టీ తరఫున ఏకగ్రీవం చేశారు ..


అందులో ఎక్కువగా ఏకపక్ష గ్రామాల్లో వైసీపీ నుంచి వచ్చిన వారు ఉన్నారు .. ఇక బిల్లులు రావాల్సిన వారు ఇప్పటికే బీటెక్ రవికి టచ్ లో కి వెళ్ళిపోయారు. గతంలోల ఇప్పుడు వైసీపీ క్యాడర్ లేదు .. వైఎస్ కుటుంబంలో వచ్చిన విభేదాల కారణంగా క్యాడర్ కూడా భారీగా చీలిపోయింది .. చాలామందిలో అసంతృప్తి ఉంది .. తమకి ఏమీ చేయలేదని బాధపడుతున్నా వారంతా బీటెక్ రవి వైపు వెళ్ళిపోతున్నారు . మరి కొంతమంది షర్మిల వైపు ఉంటున్నారు .. మరికొంతమంది అవినాష్ రెడ్డితో ఉంటున్నారు .. ఇక జగన్ తరుపున పనులు చూసుకునేది అవినాష్ రెడ్డిని .. పులివెందుల్లో జగన్ కంటూ ప్రత్యేక సైన్యం లేదు .. పైనుంచి వస్తున్న ఒత్తిళ్లకారణంగా అవినాష్ రెడ్డి లైట్ తీసుకుంటే పులివెందుల ఫలితం మారిపోతుంది . అందుకే ఉప ఎన్నికలు వస్తే జగన్ కు అంత ఈజీ కాదన్న చర్చ ఇప్పుడు గట్టిగా నడుస్తుంద.

మరింత సమాచారం తెలుసుకోండి: