- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి .. ఒకేరోజు రెండు భారీ ఎదురు దెబ్బలు తగిలాయి . దీంతో సీనియర్ నాయకులు ఎవరు మీడియా ముందుకు వచ్చేందుకు కూడా ఇష్టపడటం లేదు . తాజాగా.. చోటు చేసుకున్న ఈ రెండు పరిణామాల పైన వైసీపీ నేతలు పెద్దగా స్పందించడం లేదు . వైసీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హైదరాబాద్‌లో అరెస్టు చేయడం పెద్ద సంచలనంగా మారింది . ఒక్క‌ రోజంతా ఈ వార్త రాజకీయ వర్గాలలో పెను సంచలనం సృష్టించింది . వాస్తవానికి వంశీ .. తనపైన మొదలైన టీడీపీ కార్యాలయం పై దాడి కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు.


ఈ క్రమంలోని హైకోర్టులో ముందస్తుబెయిల్‌ కోసం పిటిషన్ దాఖలు చేశారు . ఇది విచారణలో ఉండగానే.. వంశీ పై కుట్ర, కిడ్నాప్ కేసులు నమోదు కావడం .. ఈ కేసుల్లో ఆయన ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నించే లోగానే .. పోలీసులు హుటాహుటీన‌ ఆయనను అరెస్టు చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామంతో వైసీపీ నేతలు అందరూ షాక్ అయిపోయారు. ఇక మరో కీలక కేసు మాజీ ఎమ్మెల్యే కొట్టారు అబ్బయ్య చౌదరి ఉదాంతం. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కారును అడ్డగించరన్న కేస్‌తో పాటు .. ప్రభాకరపై హత్యాయత్నం చేశారన్న అభియోగాలతో అబ్బయ్య చౌదరిపై కేసు నమోదయింది.


ఈ రెండు పరిణామాలు కూడా ఒకేరోజు జరగడంతో.. వైసీపీ నేతలు సమర్ధించుకునే అవకాశం లేకుండా పోయింది . మరోవైపు పార్టీ అధినేత జగన్ ఈ రెండు ఉదంతాలపై కేవలం మొక్కుబడిగా స్పందించి .. కూటమి సర్కార్ పై విమర్శలు చేసి ఊరుకున్నారు . దీంతో.. ఇక సీనియర్లు, జూనియర్ల‌ని తేడా లేకుండా ఎవరు కూడా ఈ విషయంలో ఎవ‌రు కూడా మీడియా ముందుకు వచ్చి గట్టిగా మాట్లాడే ప్రయత్నం కూడా చేయడానికి భయపడుతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: