దేవినేని ఉమామహేశ్వర రావు ఉమ్మడి కృష్ణాజిల్లా రాజకీయాలలో దాదాపు రెండున్నర దశాబ్దాలుగా చక్రం తిప్పిన వ్యక్తి . ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ , మైలవరం నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు . 1999 , 2004లో నందిగామ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గం .. ఎస్సీలకు రిజర్వ్ కావడంతో మైలవరం నియోజకవర్గం లో ఉమా 2009 , 2014 ఎన్నికలలో కూడా వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు . రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన ఎన్నికలలో.. నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఉమా .. చంద్రబాబు క్యాబినెట్‌లో .. కీలకమైన భారీ నీటిపారుద‌ల‌ శాఖ మంత్రి గా కూడా పనిచేశారు .


2019 ఎన్నికలలో.. తన చిరకాల రాజకీయ ప్రత్యర్థైన వసంత కృష్ణ ప్రసాద్ చేతిలో ఉమా తొలిసారిగా ఓడిపోయారు . కానీ .. ఒకే ఒక ఓటమి ఉమా రాజకీయ జీవితాన్ని తలకిందులు చేస్తుందని ఎవరు ఊహించలేదు . ఈ ఒక్క ఓటమి దెబ్బతో ఆయనకు గత ఎన్నికల్లో అసలు టిక్కెట్ లేకుండా పోయింది. అంతకంటే అవమానం ఏంటంటే .. తనపై వైసీపీ నుంచి గెలిచిన వసంత కృష్ణ ప్రసాద్‌ను తెలుగుదేశం పార్టీలో తీసుకుని ఆయనకు టీడీపీ సీటు ఇచ్చారు చంద్రబాబు . ఇది ఉమాకు నిజంగా ఘోర అవమానం లాంటిదే . కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా .. ఉమాను ఎవరు పట్టించుకోవడం లేదు.

ఈ క్రమంలోనే ఉమా తాజాగా పార్టీని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేశారన్న ప్రచారం జిల్లా రాజకీయ వర్గాలలో జరుగుతోంది .  తాజాగా నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలలో ఆయన తెరవెనక మంత్రంగం నడిపారని .. పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఎంపిక విషయంలో అధిష్టానం తరుపున విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని ఒక పేరు ప్రతిపాదించారు . అయితే .. స్థానిక ఎమ్మెల్యే సౌమ్య అందుకు ఒప్పుకోలేదు. మరో వ్యక్తికి చైర్‌ పర్సన్ ఇవ్వాలని పట్టుబట్టి తన మాట నెగ్గించుకున్నారు . దీని వెనక ఉమా మంత్రంగం నడిపారని .. పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది .

మరింత సమాచారం తెలుసుకోండి: