![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/ycpf04ecedc-e75c-42a4-9f76-2f33d16ae563-415x250.jpg)
వైసీపీ నాయకురాలు , మాజీ మంత్రి .. నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా .. మరో మాజీ మంత్రి .. ప్రస్తుత వైసీపీ పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి మధ్య రాజకీయ విభేదాలు ఉన్న విషయం తెలిసిందే . మరీ ముఖ్యంగా... పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నగరి నియోజకవర్గం లో రోజాను ఎప్పటికప్పుడు ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే నగరి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు కేజే కుమార్ కుటుంబాన్ని పెద్దిరెడ్డి రాజకీయంగా బాగా ప్రోత్సహిస్తూ వచ్చారు . రోజాకు వ్యతిరేకంగా కేజే కుమార్ కుటుంబాన్ని పైకి తీసుకురావాలని పెద్ది రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారు . నగరి నియోజకవర్గం లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా.. మంత్రి గా కూడా పనిచేశారు . రోజా మంత్రిగా ఉన్నప్పుడే పెద్దిరెడ్డి నగర నియోజకవర్గం లో బాగా జోక్యం చేసుకునేవారు .
మొన ఎన్నికల్లో రోజా ఓడిపోయారు. పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు . అయినా కూడా రోజా, పెద్దిరెడ్డి మధ్య రాజకీయంగా వివాదాలు రగులుతూనే ఉన్నాయి . తాజాగా పెద్దిరెడ్డి నగరి టీడీపీ ఎమ్మెల్యే .. గాలి భాను ప్రకాష్ సోదరుడు గాలి జగదీష్ నాయుడు .. వైసీపీలో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది . వచ్చే ఎన్నికలలో రోజను పూర్తిగా పక్కన పెట్టి .. జగదీష్‌కు వైసీపీ టిక్కెట్ ఇచ్చేలా పెద్దిరెడ్డి పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది . ఎలాగైనా రోజాపై రాజకీయంగా పై చేయి సాధించాలని .. పెద్దిరెడ్డి ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టేసారట. అయితే జగదీష్‌ను వైసీపీలో చేర్చుకునే విషయంపై రోజాకు సమాచారం ఇవ్వలేదని .. దీంతో జగదీష్.. వైసీపీ చేరికను రోజా పార్టీ అధినేత జగన్ ద్వారా.. ఒత్తిడి తెచ్చి అడ్డుకునే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. మరి ఈ పంతం ఎక్కడ వరకు వెళుతుందో చూడాలి .