
ఏపీ మాజీ మంత్రి రోజా దగ్గర బంధువు అయినా మహిళతో కిరణ్ రాయల్ కు అక్రమ సంబంధం ఉందని బాంబ్ పేల్చింది లక్ష్మి రెడ్డి. రోజాను తిట్టిన కేసులో కిరణ్ అరెస్టు అయితే రాత్రికి రాత్రే బయటకు వచ్చాడని గుర్తు చేశారు. దానికి కారణం రోజా దగ్గర బంధువుతో ఉన్న సంబంధమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు లక్ష్మి రెడ్డి. ఆ మహిళలతో ఉన్న సంబంధం ఉన్న వీడియో, ఫోటోలు నా దగ్గర ఉన్నాయని కిరణ్ రాయల్ చెప్పినట్లు తెలిపింది. వాటినీ చూపించే ఆ మహిళను బెదిరించి బయటకు వచ్చాడని తెలిపారు లక్ష్మి రెడ్డి.
ఆ కారణం వల్లే గతంలో కిరణ్ రాయల్ ను అరెస్ట్ చేసిన తరువాత పోలీసులు వదిలేశారని గుర్తు చేశారు. కిలాడి లేడీ అని నాపై ఆరోపణలు చేశారని మండిపడింది. అవసరానికి వాడుకొని… అవసరం తీరాక ఆమెపై దాడి చేశాడని కిరణ్ రాయల్ పై ఆగ్రహించింది. కిరణ్ రాయల్ ఏం వ్యాపారాలు చేస్తున్నాడని ప్రశ్నించారు. భూమన అభినయ్ రెడ్డితో నాకు అక్రమ సంబంధం ఉందని చెప్పడం దారుణం అంటూ ఆగ్రహించింది.
భూమన అభినయ్ రెడ్డి నాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ లు అమ్ముకోవడం కిరణ్ కే చెల్లిందన్నారు. చెన్నై నల్లి సిల్క్స్ చీరలు తెచ్చి శ్రీవారి వస్త్రం పేరుతో అమ్ముకుని వ్యాపారం చేస్తాడని బాంబ్ పేల్చింది. మోసం చేసి సంప్రదించడమే కిరణ్ రాయల్ కు తెలుసు అన్నారు. ఫోటోలు మార్ఫింగ్ అని చెప్పి నాపై కేసులు పెడుతున్నారని ఆగ్రహించింది.