![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_analysis/pushpa-29e5f4d60-d444-4e9d-b7b2-8c8323bcfc5b-415x250.jpg)
పుష్ప 2 చిత్రంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. వీరప్పన్, పూలన్ దేవిల బయోపిక్ చిత్రాలు తీస్తున్నారని ఆగ్రహించారు మంత్రి సత్య కుమార్ యాదవ్. వీరి బయోపిక్ వల్ల ఏమి నేర్చుకోవాలంటూ నిలదీశారు మంత్రి సత్య కుమార్ యాదవ్. స్మగ్లర్ల పై కూడా సినిమాలు తీస్తున్నారని పుష్ప 2 చిత్రంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ హాట్ కామెంట్స్ చేయడం జరిగింది.
ఐటెం సాంగ్స్ పెట్టి రూ వందలకోట్ల కలెక్షన్లు వచ్చాయని చెప్పుకుంటున్నారని ఫైర్ అయ్యారు. తల్లిదండ్రులు కూడా ఓటీటిలో పుష్ప 2 చిత్రాన్ని చిన్నారులకు చూపిస్తున్నారని సీరియస్ అయ్యారు మంత్రి సత్య కుమార్ యాదవ్. దీనివల్ల చిన్నారులకు ఏమి చెప్తున్నారని నిలదీశారు. స్మగ్లర్లలా మారమనా...లేక.. డాక్టర్లు కావాలనా... ? అంటూ ప్రశ్నించారు మంత్రి సత్య కుమార్ యాదవ్.
ఆదర్శవమైన వ్యక్తులపై బయోపిక్ చిత్రాలు రావాలని డిమాండ్ చేశారు. ఇక పైన స్మగ్లర్ల సినిమాలు తీయకూడదని కోరారు. ఇది ఇలా ఉండగా.. అల్లు అర్జున్ తాజాగా నటించిన సినిమా పుష్ప 2 రిలీజ్ అయిన రోజు రేవతి అనే మహిళ మరణించారు. అటు రేవతి కొడుకు కూడా ఆస్పత్రి పాలయ్యాడు. అతడు ఇంకా కిమ్స్ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నాడు.