ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సైతం సీఎం చంద్రబాబు చాలా చేయాలని ఉంది.అయితే ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు ఖజానా మొత్తం ఖాళీ అయిపోయిందంటూ తన వాదన మొదలుపెట్టారు. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలల ఎన్నో పథకాలు అమలు చేశామంటూ వెల్లడించారు.. ఫ్రీ గ్యాస్, పింఛన్ పెంపు, అన్నా క్యాంటీన్ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చామని ఇంకా చాలా సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉన్నదని కానీ ఆంధ్రప్రదేశ్ ఖజానా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటూ వెల్లడించారు. దీంతో ఇప్పుడు మరొకసారి ఈ సంక్షేమ పథకాల సమస్య చర్చగా కొనసాగుతూ ఉంది ఏపీ అంతట.


సూపర్ సిక్స్ హామీలు ద్వారా  బంపర్ విక్టరీ సాధించిన కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి సెగ మొదలవుతోంది. చాలామంది ఇతర పార్టీ నేతలు కూడా చంద్రబాబు అంటే మోసం మోసం అంటే చంద్రబాబు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. హామీలు ఇవ్వడం నెరవేర్చకపోవడం ఆయనకు అలవాటే అంటూ చాలామంది విమర్శిస్తున్నారు. ఇలా హామీలు అమలు చేయకపోవడంతో అటు ప్రజల నుంచి ఇటు నేతల నుంచి కూటమి ప్రభుత్వానికి చాలా విమర్శలు వినిపిస్తున్నాయి.


గత ప్రభుత్వం వల్ల సంపద పెరగలేదని ఐదేళ్లలో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు అయ్యాయి అంటూ తెలిపారు. అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు చేస్తున్నామంటూ వెల్లడిస్తున్న సీఎం చంద్రబాబు గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగింది అంటూ వెల్లడిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలోనే హామీలు అమలు చేయడం కూడా కూటమి ప్రభుత్వానికి సవాల్గా మారినట్లు కనిపిస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే సీఎం చంద్రబాబు ఇలా వ్యాఖ్యలు చేయడం చాలామంది నేతలను కూడా అసహనానికి గురయ్యేలా చేస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈ ఏడాది కూడా హామీలు అమలు అయ్యేలా ఎక్కడా కనిపించడం లేదని అనుమానాలు కూడా ప్రజలలో మొదలవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: