తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవికి గండం ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే రేవంత్ రెడ్డిని దించి వేస్తారని.. అతనిపై చాలామంది అధిష్టానానికి ఫిర్యాదు చేశారని కూడా తెలుస్తోంది. తాజాగా ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్... దీనిపైన చిట్ చాట్ లో స్పందించారు. కొందరు తన సీటు కోసం మాత్రమే చూస్తున్నారని.. ముందు ఉన్న సవాళ్లు మాత్రం పట్టించుకోవడం లేదని... ఆగ్రహించారు ఆగ్రహించారు రేవంత్ రెడ్డి.

 

ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తాను ముందుకు వెళ్తానని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నాలు చేస్తానని చిట్ చాట్ లో తెలిపారు రేవంత్ రెడ్డి. అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వైరల్ కావడంతో... తెలంగాణ సీఎం మార్పు ఉంటుందని కొంతమంది అంటున్నారు. ఢిల్లీ దాకా వెళ్ళిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని కలిసినట్లు చెప్పారు. కాంగ్రెస్ అనుకూల మీడియా అలాగే ఇతర మీడియా సంస్థల్లో కూడా ఈ వార్త వచ్చింది.

 

కానీ రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి దిగిన ఫోటోలు మాత్రం బయటికి ఇప్పటికీ రిలీజ్ చేయలేదు. గత ఎనిమిది నెలలుగా రాహుల్ గాంధీ... రేవంత్ రెడ్డికి అస్సలు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని కూడా చర్చ జరుగుతోంది. అయితే తాజాగా రాహుల్ గాంధీని కలిసి ఎందుకే ఢిల్లీ వెళ్లినట్లు రేవంత్ రెడ్డి గురించి ఆయన అనుకూల మీడియా కోడై పూసింది. కానీ ఇప్పటికీ ఫోటోలు బయటికి రాలేదు.

 

అయితే చిట్ చాట్ లో మాత్రం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దీన్నిబట్టి చూస్తే ఆయనకు మరోసారి అపాయింట్మెంట్ దొరకలేదని తెలుస్తోంది.  ఇప్పటికే రేవంత్ రెడ్డి పై అనేక ఫిర్యాదులు చేశారట తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఆయన పాలన వల్ల కాంగ్రెస్ దెబ్బతింటుందని.. చెప్పారట. అందుకే రేవంత్ రెడ్డి ని కాస్త దూరం పెట్టాడట రాహుల్ గాంధీ.  అయితే తాజా పరిణామాల నేపథ్యంలో... సీఎం మార్పు ఉంటుందని అంటున్నారు. మరి దీనిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: