
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు పురందరేశ్వరితో మంతనాలు కూడా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తన అనుచరులతో అంతరంగీక భేటీలు కూడా నిర్వహించారట కేసినేని నాని. అతి త్వరలోనే బిజెపికి వెళ్లడం పైన ప్రకటన కూడా రానుందట. మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన... అనంతరం.. పూర్తిగా రాజకీయాలకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటన చేశారు కేశినేని నాని. అయితే ఇప్పుడు ఆయన యూటర్న్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
త్వరలోనే.. రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి భారతీయ జనతా పార్టీలో కీలక పాత్ర పోషించేందుకు కేసినేని నాని రంగం సిద్ధం చేసుకుంటున్నారట. దీనికి బిజెపి అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇలాంటి నేపథ్యంలో.. విజయవాడ రాజకీయాలు రసవత్తరంగా.. మారడం జరిగింది. ఇక తాజాగా తన కార్యకర్తల సమావేశంలో కూడా కేసినేని మాట్లాడారు. తాను విజయవాడ కోసం ప్రాణాలు కూడా ఇస్తానని ప్రకటన చేశారు.
తనను రెండుసార్లు గెలిపించిన విజయవాడ ప్రజల కోసం.. ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు కేసినేని నాని. ఇలాంటి నేపథ్యంలో ఆయన పొలిటికల్ రీయంట్రి ఖాయమని అంటున్నారు. ఇది ఇలా ఉండగా ఎన్నికల కంటే ముందు వైసీపీ పార్టీలోకి వెళ్లిన కేసినేని నాని... తన సోదరుడు చిన్ని పైన ఓడిపోయారు. దీంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కేసినేని నాని... ప్రస్తుతం వ్యాపారాలు చూసుకుంటున్నారు.