
మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘాల వినతి గా సూచనల పైన చర్చించిన తర్వాత ప్రభుత్వానికి అధికారులు కొంతమేరకు నివేదిక కూడా ఇచ్చారట.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా సేవలు పొందేందుకు సైతం ఏపీ ప్రభుత్వం సరికొత్త ప్రణాళికను రూపొందించబోతోందట. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను రేషనేలైజేషన్ చేయాలని .. ఈ ఉద్యోగులు కొన్నిచోట్ల ఎక్కువగా ఉన్నారని.. మరికొన్ని ప్రాంతాలలో చాలా తక్కువగా ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలియజేశారు. ఈ రేషనాలైజేషన్ ప్రక్రియ ద్వారా అన్నిచోట్ల ఒకే విధంగా ఉండేలా కసరత్తులు చేస్తున్నారట.
రాష్ట్రంలో ప్రస్తుతం 11,162 గ్రామ సచివాలయాలతో పాటుగా, 3,842 వార్డు సచివాలయాలు కూడా ఉన్నాయట. ఇందులో 1,27,175 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.. ఒక్కో సచివాలయంలో సుమారుగా 10 మంది ఉద్యోగులు ఉండేలా ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వం. అయితే చాలా ప్రాంతాలలో సచివాలయాలను చాలా తక్కువ మందితోనే నడిపిస్తూ ఉన్నారట.. దీంతో మల్టీపర్పస్ ఫంక్షన్హారీస్, టెక్నికల్ ఫంక్షన్ రీస్ గా వీరిని విభజించి ఆ తర్వాత పలు రకాల నిర్ణయాలను తీసుకునేలా చూస్తున్నారట. ఇటీవలే ఉద్యోగ సంఘాలతో మంత్రి వీరాంజనేయ స్వామి మాట్లాడినట్లు తెలుస్తోంది. మరి ఏ మేరకు ఉద్యోగ సంఘాలు ఈ నిర్ణయాన్ని ఒప్పుకుంటారు.. మరి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ నిబంధనలకు ఒప్పుకుంటారా లేదా చూడాలి.