తెలంగాణలో సారవంతమైన భూములు ఉన్నా ఎంతో ఖనిజ సంపద ఉన్నా వాటిని ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉన్న రోజులవి.. దొరలు, దోపిడీదారుల చేతుల్లో బందీలై ఎంతోమంది  తెలంగాణ ప్రజలు చిత్రహింసలు అనుభవించారు.. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన అంతం చేయడానికి నడుము కట్టి కొడవలి పట్టినటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ నుంచి మొదలు  కెసిఆర్ వరకు ఎన్నో పోరాటాలు తెలిపారు.. దొరల గుండెల్లో పిడుగులు పడేలా చేసిన ఐలమ్మ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.. అదే స్ఫూర్తితో కేసిఆర్ కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే వరకు అలుపెరుగని పోరాటం చేశారు.. నేను సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అనే నినాదంతో  మారుమూల పల్లెల నుంచి పట్టణాల వరకు ముసలోళ్ల నుంచి చిన్న పిల్లల వరకు అందరినీ ఏకం చేసి ఆటపాటల ద్వారా రాష్ట్రంలో ఉద్యమానికి తెరలేపారు.. చివరికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి కేసీఆర్ మొదటి ముఖ్యమంత్రిగా  మనకు పాలన అందించారని చెప్పవచ్చు..

అలాంటి కేసీఆర్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలాంటి పథకాలు తీసుకొచ్చారు ఆ వివరాలు ఏంటో చూద్దాం..మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్  1954 ఫిబ్రవరి 17వ తేదీన జన్మించారు.. ఈయన స్వస్థలం సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామం.. తల్లిదండ్రులు కల్వకుంట్ల రాఘవరావు వెంకటమ్మ. అలాంటి కేసిఆర్ చిన్నతనం నుంచే  చదువులో చాలా యాక్టివ్ గా ఉండేవారు. తెలుగు సాహిత్యంలో బీ.ఏ పూర్తి చేసిన ఈయన  14 ఏళ్ల వయసులోనే శోభమ్మని పెళ్లి చేసుకున్నారు.  అలాంటి కెసిఆర్  రాజకీయాల వైపు మళ్లీ మొదటిసారి సిద్దిపేట నుంచి పోటీ చేసి  ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ఎప్పుడైతే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారో అప్పటినుంచి ఆయన మనసులో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ఆలోచన ఉండేది. అలా తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి కొన్ని సంవత్సరాల పాటు ఆ పార్టీని కాపాడుకుంటూ వచ్చారు.

చివరికి ఈ పార్టీస్పూర్తితోనే రాష్ట్ర ప్రజలందరినీ ఏకం చేసి చివరికి రాష్ట్రాన్ని సాధించి తొమ్మిదేళ్లపాటు సీఎం అయ్యారు. అలాంటి కేసిఆర్  తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడలేని పథకాలను కూడా తీసుకొచ్చారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈయన తెచ్చిన పథకాల్లో కళ్యాణ లక్ష్మి, హరితహారం,షాదీ ముబారక్, మిషన్ భగీరథ,రైతుబంధు, రైతు భీమా,టీఎస్ ఐ పాస్, ధరణి,ఆసరా పింఛన్లు, దళిత బంధు, బీసీ బందు ఇలా  దళిత అణగారిన వర్గాల కోసం మంచి పథకాలను తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజల దేవుడయ్యారు.. కానీ చివరికి 2023 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో  ఓటమిపాలై ఇంటికే పరిమితమయ్యారు. అయినా కేసీఆర్ ను ఇప్పటికి కూడా ఎవరూ మరవడం లేదు.. అలా రాష్ట్ర సాధన నుంచి మొదలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఈ కార్యసాధకుడికి  పుట్టినరోజు శుభాకాంక్షలు.



మరింత సమాచారం తెలుసుకోండి: