ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసిపి పార్టీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. త్వరలోనే మరో ఎనిమిది మంది లీడర్లు జంప్ అయ్యే ప్రమాదం పొంచి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో ఐదుగురు శాసనసభ్యులు కాగా మరో ముగ్గురు రాజ్యసభ సభ్యులు కూడా... కండువా మార్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. దీనికోసం ఇప్పటినుంచి టిడిపి కూటమి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వైయస్ జగన్మోహన్ రెడ్డి వద్ద 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న సంగతి తెలిసిందే.

 అలాగే ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అంతకుముందు 11 మంది రాజ్యసభ సభ్యులు ఉంటే అందులో నలుగురు జంపాయ్యారు. ఇంకా.. మన ఎన్నికల్లో నలుగురు పార్లమెంటు సభ్యులు విజయం సాధించారు. ఆ నలుగురు వైయస్ జగన్మోహన్ రెడ్డికి నమ్మకస్తుల అన్న సంగతి తెలిసిందే. అయితే పార్లమెంటు సభ్యులు జంప్ అయ్యే అవకాశాలు లేవు కానీ.. ఎమ్మెల్యే అలాగే రాజ్యసభ సభ్యుల్లో.. కొంతమంది డౌట్ ఉంది.

 11 మంది ఎమ్మెల్యేలలో.... పెద్దిరెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. వీళ్ళిద్దరి మినహా మిగతా 9 మందిలో... ఐదు మంది ఎమ్మెల్యేలను తీసుకువెళ్లేందుకు టిడిపి కూటమి ప్రయత్నాలు చేస్తుండట. అలాగే రాజ్యసభకు చెందిన ముగ్గురిని బిజెపిలోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ప్రస్తుతం వల్లభనేని వంశీ అరెస్టు ఎపిసోడ్ కొనసాగుతోంది. కాబట్టి... ఈనెల చివరి వరకు వల్లభనేని వంశీ గురించి నిత్యం వార్తలు... వస్తూ ఉంటాయి.

 వచ్చే నెలలో... ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో వైసిపి పార్టీ పోటీ చేయలేదు కనుక టిడిపి ఏకగ్రీవంగా విజయం సాధించే ఛాన్సులు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో... ఏప్రిల్ మాసంలో... వైసిపి పార్టీ నేతలకు కూటమి కండువాలు  కప్పేందుకు రంగం సిద్ధం చేశారట. ఈ మెరకు ఇప్పటికే వైసీపీ నేతలతో చర్చలు కూడా జరిగినట్లు చెబుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఏకంగా ఎనిమిది.... వైసిపి పార్టీ నుంచి జంప్ అవుతారన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: