- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

ఆంధ్రప్రదేశ్లో ఉప ఎన్నికలు వస్తాయా ? వస్తే ఏం జరుగుతుంది .. వైసీపీ వర్సెస్ టిడిపిగా ఉన్న ఈ విషయం ఇప్పుడు ప్రతి ప్రాంతానికి చేరిపోయింది. ఎక్కడ ఏ నలుగురు గుమి కూడినా ఇదే చర్చ సాగుతోంది. టిడిపి ఎమ్మెల్యే ఉప సభాపతి రఘురాం కృష్ణంరాజు వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ గురించి చేసిన కామెంట్లు తర్వాత కూటమిలో ఈ చర్చ ప్ర‌ధానంగా తెర‌మీద కు వచ్చింది. నిన్న మొన్నటి వరకు రఘురామ తన కేసులపై పోరాటం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా ఆయన జగనే టార్గెట్ చేస్తున్నారు. జగన్ వరుసగా 60 రోజులు సభకు రాకపోతే ఎమ్మెల్యే సభ్యత్వం ఉండదని .. ఆయన కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా మాట్లాడుతున్నారు. నిజానికి సభ వరుసగా 60 రోజులు జరగాల్సి ఉంది. దీనికి సభా నాయకుడిగా ఉన్న సీఎం చంద్రబాబు ఓకే చెప్పాలి . . అప్పుడు కూడా జగన్ వరుసగా రాకపోతే ఆయన సభ్యత్వం రద్దు అవుతుంది. అయితే ఇక్కడ ఆయన ఒకరే కాదు వైసీపీ తరఫున విజయం దక్కించుకున్న మరో పదిమంది సభ్యత్వం కూడా రద్దు అవుతుంది.


ఇదే జరిగితే ఏపీలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కచ్చితంగా కనిపిస్తోంది. ఈ విషయంలో వైసిపి వెనక్కి తగ్గితే ఒకటి రెండు రోజులు సభకు వచ్చిన వారి ఎమ్మెల్యే పదవులు అలాగే ఉంటాయి. ప్రస్తుతానికి పంతానికి పోతున్న జగన్ సభకు వచ్చేది లేదని తనకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నారు. సో ఈ రెండు కారణాలతో ఉప ఎన్నికలకు అవకాశం లేకపోలేదు అన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఉన్న అంచనాలు ప్రకారం ప్రభుత్వంపై ఇంకా పూర్తిస్థాయిలో వ్యతిరేకత లేదు. అలాగని సానుకూలత కూడా పూర్తిగా రాలేదు .. చంద్రబాబు ప్రభుత్వం పాలన ప్రారంభించి 8 నెలలు అయిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు చంద్రబాబు పైన ప్రభుత్వం పైన పెద్దగా వ్యతిరేకత లేనందున ఉప ఎన్నికలు వచ్చిన వైసీపీకి అంత మెరుగైన ఫలితాలు దక్కే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: