
తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు... ఎన్నో ఉన్నత స్థాయిలను అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీ పెట్టి... రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. 2001 సంవత్సరంలో... కొత్త పార్టీ పెట్టిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు... ఆ తర్వాత... ఎన్నో పోరాటాలు చేశారు.
తెలంగాణ ఇస్తామని ఏ పార్టీ చెప్పిన ఆ పార్టీ వెంబడి నడిచారు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీలో పని చేసిన కేసీఆర్.. చంద్రబాబు విధానాలు నచ్చక ఆ పార్టీ నుంచి బయటికి... వచ్చారు. ఈ తరుణంలోనే గులాబీ పార్టీని 2001 సంవత్సరంలో ప్రారంభించారు కేసీఆర్. ఈ తరుణంలోనే... కాంగ్రెస్ పార్టీతో పొత్తు కూడా పెట్టుకున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ తెలంగాణ వాదాన్ని.. చంపేసింది.
దీంతో కాంగ్రెస్ పొత్తును వదులుకున్న కేసీఆర్ ఆ తర్వాత ఉప ఎన్నికలకు వెళ్లారు. అక్కడ విజయం సాధించి మళ్లీ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకువచ్చారు. ఆ తర్వాత... టిడిపి పార్టీతో కూడా కలిశారు కేసీఆర్. అక్కడ కూడా ప్రయోజనం రాలేదు. ఇక చేసేదేమీ లేక... వైయస్సార్ మరణం తర్వాత.. ఆమరణ దీక్షకు దిగారు కేసీఆర్. దాదాపు పది రోజులు దీక్ష చేసిన తర్వాత తెలంగాణపై ప్రకటన వచ్చింది.
అప్పుడే కేసీఆర్ గ్రహించి.. తాను చచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదాన్ని కూడా ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్లారు. అయితే కేసీఆర్.. ఆరోగ్య పరిస్థితి అప్పుడు విషమించడంతో కాంగ్రెస్ దిగి వచ్చి తెలంగాణ పై ప్రకటన చేసింది. అయితే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ను విరమించిన తర్వాత... మళ్లీ.. కాంగ్రెస్ కాలయాపన చేసి 2013 సంవత్సరంలో... పది జిల్లాల తెలంగాణను ఇచ్చింది. అయితే తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్... పనితీరును చూసిన తెలంగాణ ప్రజలు... దాదాపు పది సంవత్సరాలపాటు ఆయనకు అవకాశం కల్పించారు.