
ముఖ్యంగా యూనివర్సిటీలో కొంతమంది ఆకతాయిలు సైతం అమ్మాయిల బాత్రూంలోకి తొంగి చూస్తున్నట్లుగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.. గత కొంతకాలంగా ఇదే తంతు కొనసాగుతోందని.. అక్కడ అధికారులు డీజీపీ, డిఐజిలకు సైతం ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని విధంగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా నిన్నటి రోజున రాత్రి సమయాలలో కొందరు మంది బాత్రూంలో తొంగి చూడడమే కాకుండా అమ్మాయిలకు సంబంధించి ఫోటోలు తీస్తూ ఉండడాన్ని గమనించిన కొంతమంది విద్యార్థులు ఒక్కసారిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి ఆ యువకులు పరారయ్యారట. ఈ విషయం పైన భయభ్రాంతులకు గురై అమ్మాయిలు రోడ్డుపైనే ఆందోళనకు దిగారట. గతంలో ఈ సంఘటనకు సంబంధించి యూనివర్సిటీకి సంబంధించిన వారందరికీ కంప్లైంట్ ఇచ్చిన ఎవరూ కూడా ఏ చర్యలు తీసుకోలేదట.
దీంతో అర్ధరాత్రి వేళ క్యాంపస్ రోడ్డుపైనే విద్యార్థుల సైతం బైఠాయించి నిరసనలు తెలియజేశారు ఈ విషయం తెలిసిన ఆ విద్యార్థిని తల్లితండ్రులు కూడా అక్కడ స్థానికుల పైన ఆగ్రహాన్ని తెలియజేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి కూడా విద్యార్థులు తీసుకువెళ్లారట. అప్పట్లో బుక్కరాయ సముద్రం పోలీసులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని విధంగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి కూడా యూనివర్సిటీ కి వెళ్లి మరి పరిశీలించి వచ్చి మరి చర్యలు తీసుకోవాలంటే మహిళా ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చినా కూడా పట్టించుకోలేదట. మరి ఇకనైనా ప్రభుత్వం ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో చూడాలి.