తాజాగా సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో సీరియస్గా తీసుకున్నారట.. ఆయన రివ్యూ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి.? అన్నది ఇప్పుడు టిడిపి నేతల ప్రశ్నగా మారింది. ఏదైనా సరే చిన్నదే అని సరి పెట్టుకోకుండా.. చిన్న పాము నైన పెద్దకర్రతో కొట్టే రకం అందుకని ఆ రూట్లోనే వెళ్తున్నారట చంద్రబాబు..ఈనెల 27వ తేదీన జరిగేటువంటి ఉమ్మడి గుంటూరు, కృష్ణ, ఉభయగోదావరి జిల్లాలో జరిగేటువంటి పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారట.


పట్టుభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఇందులో ముఖ్యంగా టిడిపి, పిడిఎఫ్ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉండబోతోందట. వాస్తవంగా వైసిపి పార్టీ ఉంటే ఈ ఓట్లు చీల్చేది కాస్త.. అయితే అప్పుడు ఓట్లు చీల్చడం వల్ల  పిడిఎఫ్ అభ్యర్థి ఓటమి జరుగుతుంది. దీంతో వీళ్లు ఇద్దరూ గెలవరు.. తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని నమ్మకం ఉండేది. ఎప్పుడైతే వైసీపీ పార్టీ పక్కకు వెళ్లిపోయిందో .. అప్పుడే పోటీలో ఉన్న వారిని మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది..కొంతమందిని విత్డ్రా చేపించి పార్టీలో చేర్చుకున్నటువంటి సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.


అయితే ఇప్పుడు ఉభయ  గోదావరి జిల్లా నుంచి పేరా భక్తుల రాజశేఖర్ టిడిపి నుంచి పోటీ చేయగా డివి.రాఘవులు పిడిఎఫ్ నుంచి పోటీ చేస్తున్నారు.. ఇక్కడ పిడిఎఫ్ అభ్యర్థి కూడా చాలా బలమైన వ్యక్తి. అలాగే కృష్ణ గుంటూరు జిల్లాలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ టిడిపి నుంచి బలమైన వ్యక్తి.. మాజీ మంత్రి కూడా సిట్టింగ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు పిడిఎఫ్ తరఫున కూడా పోటీ చేస్తున్న ఈయన కూడా గట్టి పోటీ ఉన్న వ్యక్తి. అక్కడ నువ్వా నేనా అన్న పోటీ ఉన్నప్పటికీ అసలు సమస్య ఎదురవుతుంది కాబట్టి.. సీరియస్గా ఎఫెక్ట్ పెట్టమంటున్నారట సీఎం చంద్రబాబు. తన ఇంటెన్షన్ ని క్లియర్ గా నాయకులకు తెలియజేశారు చంద్రబాబు. మరి ప్రతి నాయకుడు , కార్యకర్త కూడా గెలిపించే ప్రయత్నంలో ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: