భారతదేశంలో ఓటింగ్ శాతం పెంచడానికి అమెరికా భారీగా నిధులు కుమ్మరిస్తోందా? అసలు ఏం జరుగుతోంది? బైడెన్ ప్రభుత్వం తెర వెనుక ఏం చక్రం తిప్పిందా? ట్రంప్ ఎందుకు ఈ వ్యవహారాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు? ఈ ప్రశ్నలు ఇప్పుడు దేశ రాజకీయాలను కుదిపేస్తున్నాయి.

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సారథ్యంలోని సంస్థ ద్వారా ఏకంగా 183 కోట్ల రూపాయలు భారత ఎన్నికల ప్రక్రియ కోసం మంజూరయ్యాయట. వింటుంటేనే మైండ్ బ్లాక్ అవుతోంది కదూ. ఓటింగ్ శాతం పెంచడానికి ఇంత డబ్బులెందుకు? ఓటర్లకు నేరుగా డబ్బులు పంచుతారా? లేక ఇది ఓ పెద్ద కుట్రనా?

కొందరు విశ్లేషకులు మాత్రం చివరి నిమిషంలో ఓటింగ్ శాతం పెరగడానికి ఈ అమెరికా డబ్బే కారణమంటూ వాదిస్తున్నారు. ఇది నిజమా లేక మన భారతీయుల సహజమైన అలవాటును తప్పుగా అర్థం చేసుకుంటున్నారా, మనం ఏదైనా పని మొదట్లో నెమ్మదిగా చేస్తాం, కానీ గడువు దగ్గర పడేసరికి ఒక్కసారిగా ఉరుకులెత్తుతాం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. గుళ్లలో క్యూలు, లిక్కర్ షాపుల ముందు బారులు, ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ హడావుడి... ఇవన్నీ మన దైనందిన జీవితంలో చూసేవే. దీన్ని కూడా అలాగే చూడొచ్చా మరి అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది.

అయితే, ఈ 183 కోట్ల రూపాయల వ్యవహారం వెనుక ఏదో పెద్ద మతలబు ఉందని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఈ డబ్బు ఎవరి జేబుల్లోకి చేరింది? ఎందుకు ఇచ్చారు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు ఈ వ్యవహారం ఓ మిస్టరీగానే మిగిలిపోతుంది. అసలు నిజం నిగ్గు తేల్చాల్సిన సమయం ఇది.

భారతదేశ ఓటింగ్ శాతాన్ని పెంచాల్సిన అవసరం అమెరికాకు ఎందుకు వచ్చింది, ఇందులో వారి ప్రయోజనం ఏమిటి, ఈ నిధులు ఏ సంస్థ ద్వారా వచ్చాయి, ఎవరికి చేరాయి అనే విషయాలు మాత్రం ఇప్పటికీ గోప్యంగానే ఉన్నాయి. ఈ రహస్య ఒప్పందం వెనుక దాగున్న అసలు ఉద్దేశం ఏమిటో తెలుసుకునే వరకు, ఇది ఒక పెద్ద రాజకీయ కుట్రగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపితేనే నిజానిజాలు వెలుగులోకి వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: