![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/ycp130249d7-bbad-4b49-9e52-06103905e580-415x250.jpg)
వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కోసం రాజకీయంగా ఎన్నో త్యాగాలు చేసిన వారు ఎన్నో పదవులు వదులుకున్న వారు సైతం ఇప్పుడు ఆ పార్టీలో ఇమడలేని పరిస్థితి. ఇది ఇలా ఉంటే జగన్ కోసం ఎన్నో త్యాగాలు చేసి .. ఎన్నో పదవులు వదులుకొని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ముందు నుంచి వైసీపీ కోసం జగన్ కోసం అండగా నిలబడిన మేకపాటి ఫ్యామిలీ రాజకీయం వైసీపీలో దాదాపు ముగిసిపోబోతుందా ? అంటే అవును అనే చర్చలు వినిపిస్తున్నాయి. తాజాగా మేకపాటి ఫ్యామిలీ కురు వృద్ధుడు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చేయకూడని తప్పు చేశారు. ఓ వేడుకలో తనకు నమస్కరించిన నారా లోకేష్ ను ఆయన లేచి నిలబడి శభాష్ లోకేష్ అని అభినందించారు. ఇదంతా మీడియాలో రికార్డు అయింది .. బాగా వైరల్ అయింది. అంతే వైసీపీలో ఒక మేకపాటి ఫ్యామిలీకి భవిష్యత్తు లేదని తీర్మానించుకుంటున్నారు వైసీపీ నేతలు. పొరపాటున కూడా లోకేష్ ను పొగిడే వారికి జగన్ వద్ద యాక్సెస్ ఉండదు.
ఇకనుండి మేకపాటి రాజమోహన్ రెడ్డికి కూడా వైసీపీలో జగన్ దగ్గర యాక్సిస్ ఉండకపోవచ్చు .. నిజానికి వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో మేకపాటి కుటుంబం ఎంతో నష్టపోయింది. మేకపాటి రాజమోహన్ రెడ్డికి ఎంపీ సీటు ఇవ్వలేదు .. పార్టీ మారి వచ్చిన ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. మంత్రిగా ఉన్న మేకపాటి కుమారుడు చనిపోయాడు. ఆ తర్వాత ఉప ఎన్నికలలో టిడిపి పోటీ చేయకపోవడంతో ఆయన మరో కుమారుడు సులువుగానే గెలిచిన ... జగన్ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. గత ఎన్నికలలో కుమారుడు సోదరుడు ఇద్దరు ఆత్మకూరు - ఉదయగిరి నుంచి ఓడిపోయారు. ఇక తర్వాత వారి వ్యాపారాలు వారు చేసుకుంటున్నారు. మేకపాటి కి వయసు మీద పడడంతో సైలెంట్ గా ఉన్నారు. మేకపాటి మరో సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి అన్నతో విభేదించి కుటుంబానికి దూరమయ్యారు. ఇక రాజకీయాల్లో తన కుటుంబ సభ్యులు ఉంటారో లేదో కానీ మేకపాటి కుటుంబానికి మాత్రం వైసీపీలో చోటు ఉండదని వైసిపి వాళ్ళలోనే చర్చ నడుస్తుంది.