- ( ఉత్త‌రాంధ్ర - ఇండియా హెరాల్డ్ ) . . .

ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇన్చార్జ్ గా నియమితులు ఆయన మాజీ మంత్రి ... కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు ఉత్తరాంధ్ర‌ రాజకీయాలలో నెగ్గుకురావడం అంత ఈజీ కాదు అన్న వాదన వైసిపి వర్గాల్లోనే వినిపిస్తోంది. ఇక్క‌డ ఉంది మూడు జిల్లాలే అయినా అక్కడ 33 రకాల రాజకీయాలు సాగుతూ ఉంటాయి. ఎవరికి వారు నాకు నేనే రాజు నాకు నేనే మంత్రి అన్నట్టుగా వైసిపి నాయకులు ఇక్కడ వ్యవహరిస్తూ ఉంటారనేది గతంలో ఇక్కడ ఇన్చార్జిగా పనిచేసిన విజయ్ సాయి రెడ్డి చాలా సందర్భాలలో చెప్పారు. రాష్ట్ర మొత్తం రాజకీయాలు వేరు .. ఉత్తరాంధ్ర రాజకీయాలు వేరు ఇక్కడ మనుషులు .. నాయకులను నెగ్గుకురావడం అంత ఈజీ కాదు .. అయినా సాయి శక్తుల పనిచేశాను అని విశాఖ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో గెలిచిన సందర్భంగా విజయ్ సాయి రెడ్డి స్వయంగా వ్యాఖ్యానించారు.


నిజానికి ఉత్తరాంధ్ర రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి. కోస్తా సేవల మాదిరిగా కాకుండా ఉత్తరాంధ్ర‌ నాయకులు భిన్నమైన రాజకీయ శైలిలో ఉంటారు .. ఇక్కడ పార్టీలు మారే వారు తక్కువగా ఉంటారు. త‌మ స్వ‌రం మాత్ర‌మే వినిపించాలని ఎక్కడెక్కడ తమ మాటే పైన ఉండాలని కోరుకునే వారు ఎక్కువగా ఉంటారు. ఇక వ్యాపారాలు .. వ్యవహారాల్లో కామన్గా వారి పాత్ర కీలకం. దీంతో సఖ్యత కన్నా సొంత ప్రయోజనాలకే ఎక్కువ ముగ్గు చూపుతారు. అంతే కాదు కుటుంబ రాజకీయాలు కూడా ఉత్తరాంధ్ర రాజ‌కీయాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఎవరో సీనియర్ చెప్పారని ఎవరు ఇన్చార్జి చెప్పారని పంథా మార్చుకునే నాయకులు తక్కువగా ఉంటారు. ఇక్కడ జూనియర్లు కూడా ఇతర ప్రాంతాల వారిని పెద్దగా పట్టించుకోరు. వైవి సుబ్బారెడ్డి లాంటి వారికే ఇక్కడ వైసిపి నాయకులు నుంచి తీవ్ర ఎదురు గాలి వీచింది. ఈ నేపథ్యంలో కురసాల కన్నబాబు లాంటి మరీ రాజకీయ అనుభవం లేని నేత ఇక్కడ ఎలా నెట్టుకొస్తారు ఎంతవరకు నెట్టుకు వస్తారు ? పార్టీ నేతలను ఎంతవరకు సమన్వయం చేస్తారో అనేది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: