
నిన్న రాత్రి వరకు.. నామినేషన్లు వేసిన వారందరూ... తమ తమ విత్ డ్రా లు కూడా చేసుకున్నారు. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో... కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడుగురు కార్పోరేటర్లు నామినేషన్ వేయడం జరిగింది. అలాగే ముస్లిం పార్టీకి సంబంధించిన 8 మంది కార్పొరేటర్లు నామినేషన్ వేశారు. అయితే ఇందులో గులాబీ పార్టీ కూడా బరిలో ఉంది. మూడు రోజుల కిందట.. గులాబీ పార్టీ నుంచి ఇద్దరు నామినేషన్ వేశారు. అటు ఈ ఎన్నికలకు బిజెపి పార్టీ దూరంగా ఉంది.
41 మంది కార్పొరేటర్లు ఉన్న బిజెపి... అసలు ఈ ఎన్నికల్లో పాల్గొనక పోవడం... అందరినీ షాక్ నకు గురిచేస్తుంది. కానీ గులాబీ పార్టీ మాత్రం వెనకడుగు వేయడం లేదు. పోటీకి సిద్ధం అంటుంది. అటు ముస్లిం పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ ఒప్పందంతో... ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యుల కోసం ఈ ఎన్నిక నిర్వహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం ఈ స్టాండింగ్ కమిటీ పని చేస్తుంది.
ఈ స్టాండింగ్ కమిటీ మెంబర్లు... గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో కీలకపాత్ర పోషిస్తారు. వీళ్ళ నిర్ణయాలపై బిల్లులు ముందుకు సాగుతాయి. అయితే ఈ ఎన్నికల్లో... కాంగ్రెస్ గెలిస్తే... చరిత్ర అవుతుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో... హైదరాబాద్ పరిధిలో ఒక్క సీటు కూడా గెలవలేదు కాంగ్రెస్ పార్టీ. అదే టిఆర్ఎస్ పార్టీ అయితే.. హైదరాబాద్ నగరంలో ఉన్న గోషామహల్ సీటు తప్ప అన్నిటినీ గెలిచింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కార్పొరేటర్లు అలాగే ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరారు. దీంతో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.