
వాస్తవానికి నాగబాబును రాజ్యసభకు పంపించాలని తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా అనుకున్నారట. అయితే ఇదే అంశం ఢిల్లీ బిజెపి నేతలకు ఒక లేఖ ద్వారా కూడా తెలిపారట పవన్ కళ్యాణ్. దీంతో ప్రత్యేకమైన పరిస్థితులలో ఎంపీ సీటు సైతం మెగా బ్రదర్ నాగబాబుకు రాలేకపోయిందట. ఈ లెక్కలలో భాగంగా బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య మిగిలిన వారిని రాజ్యసభకు తీసుకువెళ్లారు. ఆ తర్వాత మళ్లీ నాగబాబును క్యాబినెట్ లోకి తీసుకుంటారనే విధంగా వార్తలు వినిపించాయి.
మార్చిలో జరగబోయే విస్తరణలో భాగంగా నాగబాబును తీసుకుంటారని చర్చ కూడా జరిగింది. అయితే సడన్గా వైసీపీ పార్టీ నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి ఆ రాజ్యసభకు రిజైన్ చేశారు. దీంతో అటు రాజ్యసభ స్థానం కూడా ఖాళీ కావడంతో ఈ స్థానం నాగబాబుకి ఇస్తారా లేదా అన్నట్లుగా సందేహాలు మొదలవుతున్నాయట.ఇక క్యాబినెట్లో కూడా ఏడాది తిరగకముందే మార్పులు ఉండవచ్చు అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా అనుకున్నట్టుగా నాగబాబును రాజ్యసభకు పంపించేలా ఊహాగానాలు కూటమి ప్రభుత్వంలో ఎక్కువగా వినిపిస్తున్నాయట. మరి నాగబాబు పొలిటికల్ పరిస్థితి ఏంటి అన్నది ఇంకా డైలమాలనే పడిందట. మరి ఈ విషయం పైన అటు కూటమి ప్రభుత్వ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. మరి తమ్ముడు పవన్ కళ్యాణ్ నాగబాబుకు ఎలాంటి పదవిని కట్టబెడతారో చూడాలి.