
తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశంలో కలపటం గురించి ..ఆలోచిస్తున్నాం అని చెప్పిన పదం చాలామంది ప్రజలకు ఇబ్బంది కలిగించింది... ఇది స్థానికంగా అక్కడ ప్రజల్లో తీవ్రమైన ఆవేదన కలిగిస్తోంది. పెద్ద పెద్ద పనులు పక్కన పెట్టేస్తే కనీసం ఇలాంటి చిన్న పనులు కూడా ఎందుకు ? చేయడం లేదన్న ప్రశ్నలు కూటమి అభిమానుల్లోనే ఉత్పన్నమవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రకాశం, విజయనగరం ,రంగారెడ్డి జిల్లాలు కాంగ్రెస్ హయాంలో ఏర్పడ్డాయి. పొట్టి శ్రీరాములు జిల్లా , బాలాజీ, అన్నమయ్య జిల్లాలు ఏర్పరచమనే డిమాండ్ ఎప్పటినుండో వున్నా తర్వాత టీడీపీ హయాంలోనూ పట్టించుకోలేదు.
ఇక ఆ తర్వాత మళ్ళీ కాంగీ హయాంలోనే మహామేత చావు పుణ్యాన కడప జిల్లా పేరు మారుస్తూ పనిలో పనిగా నెల్లూరు జిల్లాకు శ్రీరాములు జిల్లా అని పేరు మార్చారు. ఆ తర్వాత వైసీపీ హయాంలో మళ్ళీ 26 జిల్లాల పేరిట పూర్తిగా వాళ్ళ ఓట్ల బ్యాంకు అవసరాలకు తగ్గట్లు జిల్లాలు మార్చారు. చివరకు ఎన్టీఆర్‌కు సంబంధం లేని ప్రాంతంతో ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టారు. ఆ తర్వాత కడప, కర్నూల్, రాజమండ్రి, మచిలీపట్నం పేర్ల స్పెల్లింగులు మార్చి నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా కూటమి ప్రభుత్వం చేయలేదని వాపోతున్నారు. ఇక 2024 ఎన్నికల వాగ్దానా ల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి , కందుకూరు జిల్లాలను మారుస్తామని హామీ ఇచ్చారు.
ఇందులో అద్దంకి, కందుకూరు రెండు నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు. అలాగే ఈ రెండు పనులు చేయడంతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే పశ్చిమ ప్రాంతమైన మార్కాపురం కొత్త జిల్లా చేస్తే పార్టీకి.. ప్రభుత్వానికి మంచి మైలేజ్ వస్తుందని.. చంద్రబాబు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.