మాజీ సీఎం వైఎస్ జగన్ ఏపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత 2029 ఎన్నికలే టార్గెట్ గా ఎంతో కష్టపడుతున్నారు. కూటమి సర్కార్ చెప్పిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసే విషయంలో ఫెయిల్ అవుతున్న నేపథ్యంలో జగన్ కు మళ్లీ సీఎం అవుతాననే నమ్మకం కలుగుతోంది. జనంతో కలిసే దిశగా జగన్ అడుగులు వేస్తుండటం సోషల్ మీడియా వేదికగా ఒకింత హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.
 
జగన్ తన ఇంట్లో ప్రజలను నేరుగా కలిసే దిశగా అడుగులు వేయనున్నారని తెలుస్తోంది. జగన్ లో వచ్చిన ఈ మార్పు మంచికే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో పొలిటికల్ గా జగన్ మరిన్ని సంచలనాలను సృష్టించే ఛాన్స్ అయితే ఉంది. జగన్ తన బలాన్ని గుర్తించి ముందడుగులు వేస్తే కెరీర్ పరంగా తిరుగుండదని చెప్పవచ్చు.
 
జగన్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. జగన్ సైతం తండ్రి బాటలో నడుస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ కు కార్యకర్తల సపోర్ట్ కూడా అంతకంతకూ పెరుగుతోందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం. జగన్ ఎక్కడ ఓడిపోయాడో అక్కడే గెలిచే దిశగా అడుగులు వేస్తున్నారు. అభిమానుల హృదయాలు గెలుచుకునే దిశగా జగన్ అడుగులు పడుతున్నాయి.
 
2029 ఎన్నికల ఫలితాలు వైసీపీకి అనుకూలంగా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ రాజకీయాల్లో మరిన్ని సంచలన విజయాలు సొంతం చేసుకోవాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ సరైన సలహాలతో ముందుకెళ్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ రాజకీయాల్లో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. జగన్ పాలనను ఇప్పటికీ కోరుకునే వాళ్లు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. జగన్ కు తక్కువ సంఖ్యలో సీట్లు వచ్చినా 40 శాతం ఓటు బ్యాంక్ అయితే ఉంది. ఈ ఓటు బ్యాంక్ తక్కువ కాదు అని భావించే వాళ్లు సైతం చాలామంది ఉన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: