
ఈ తరుణంలో వల్లభనేని వంశీని పరామర్శించేందుకు... వైయస్ జగన్మోహన్ రెడ్డి కి వెళ్లారు. జగన్ తో పాటు వైసిపి కీలక అనేతలు కూడా వెంట వెళ్లారు. ఈ సందర్భంగా వల్లభనేని వంశీని పరామర్శించిన అనంతరం... జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. వైసిపి నేతలను అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు అలాగే నారా లోకేష్ కంటే వల్లభనేని వంశీకి జనాల్లో మంచి ఆదరణ ఉందని.. అందుకే అతన్ని కూటమి ప్రభుత్వం అరెస్టు చేసినట్లు ఫైర్ అయ్యారు.
చంద్రబాబు అలాగే నారా లోకేష్ కు సంబంధించిన సామాజిక వర్గంలో... ఏ నాయకుడు ఎదిగినా కూడా వాళ్ళని తొక్కేస్తారని... చురకలాడించారు. అందుకే మొదటగా వైసిపి నేత వల్లభనేని వంశీని అరెస్టు చేసినట్లు గుర్తు చేశారు. ఆ తర్వాత కొడాలి నాని లేదా దేవినేని అవినాష్ ని కూడా అరెస్టు చేసే ఛాన్సులు ఉన్నట్లు.. చెప్పుకొచ్చారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఇలా ఎన్ని అరెస్టులు చేసినా కూడా తాము తగ్గబోమని... తేల్చి చెప్పారు జగన్మోహన్ రెడ్డి.
కొంతమంది ఏపీ పోలీసులు... టిడిపి కార్యకర్తల పని చేస్తున్నారని కూడా మండిపడ్డారు. వల్లభనేని వంశీని అరెస్టు చేసిన పోలీసులను అస్సలు వదలబోమని తేల్చి చెప్పారు. ముఖ్యంగా వల్లభనేని వంశీని అరెస్టు చేసిన అధికారి.. సంవత్సరంలో రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడని చెప్పాడట... అతడు రిటైర్మెంట్ తీసుకున్న... ఏడు సముద్రాలు దాటి వెళ్లిన అక్కడి నుంచి తీసుకువస్తామని వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈ విషయంలో అస్సలు తగ్గబోనని వివరించారు.