ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో... తెరపైకి కొడాలి నాని వచ్చారు. వరుస అరెస్టులపై తాజాగా కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు కొడాలి నాని. అండర్ గ్రౌండ్ కు వెళ్లి దాక్కున్నాడు  అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో... సదరు రిపోర్టర్ కు దిమ్మ తిరిగిపోయేలా ఆన్సర్ ఇచ్చి వైరల్ అయ్యాడు. ఎల్లో మీడియా ప్రతినిధులందరి ఇంటికి ప్రతిరోజు వచ్చి కలుస్తా అంటూ... చురకలాంటించాడు.

తాను ఏ red book కు భయపడేది లేదని.. వచ్చేది తమ ప్రభుత్వం అని ధీమా వ్యక్తం చేశారు. అధికారం ఉన్నన్ని రోజులు మీడియా ముందుకు వచ్చామని... ఇప్పుడు అధికారం లేదు కాబట్టి రావడం లేదని తెలిపారు. కానీ అరెస్టుకు తాను ఎక్కడ భయపడేది లేదని వివరించారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసిన... అరెస్టు చేసిన కూడా తగ్గేదే లేదు అంటూ  స్టేట్మెంట్ ఇచ్చారు కొడాలి నాని.

 ప్రజలు తమ ఉద్యోగం పీకాసారని.. అందుకే ఆక్టివ్ గా లేనని... చెప్పుకొచ్చారు. మళ్లీ ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత.. తమ ప్రతాపం చూపిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కొడాలి నాని. బి ఆర్ నాయుడు అలాగే ఏబీఎన్ రాధాకృష్ణ  ఇంటికి వస్తేనే.. మేం ఆక్టివ్ గా ఉన్నట్లా? అంటూ ఓ రిపోర్టర్ ను నిలదీశారు కొడాలి నాని. తాజాగా జగన్మోహన్ రెడ్డితో పాటు... విజయవాడ జైలుకు వచ్చారు కొడాలి నాని. వల్లభనేని వంశీని ఇటీవల చంద్రబాబు కూటమి ప్రభుత్వం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

ఈ అరెస్టు నేపథ్యంలో... వల్లభనేని వంశీని పరామర్శించేందుకు వైయస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి ఇవాళ విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తో పాటు కొడాలి నాని అలాగే మాజీ మంత్రి పేర్ని నాని  లాంటి నేతలు కూడా వచ్చారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. వచ్చేది తమ ప్రభుత్వం... ఎవరెన్ని కుట్రలు చేసిన ఆ తర్వాత వాళ్ళ అంతు చూస్తామని హెచ్చరికలు జారీ చేశారు. సప్త సముద్రాలు దాటి వెళ్లినా కూడా.. తీసుకువస్తామని వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి: