
దీంతో ఇటీవలే గడిచిన కొన్ని గంటల క్రితం విజయవాడ జిల్లా జైలుకు సైతం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వంశీని పరామర్శించడమే కాకుండా ఆమె భార్య పంకజశ్రీని కూడా పరామర్శించినట్లు తెలుస్తోంది. వల్లభనేని వంశి అరెస్ట్ అయిన రోజున జరిగిన కొన్ని పరిణామాలను సైతం అడిగిమరీ తెలుసుకున్నారట జగన్మోహన్ రెడ్డి. జగన్ వెంట పలువురు వైసిపి నేతలు కూడా రావడం జరిగింది. దీంతో జైలు పరిసరాలలో 144 సెక్షన్ నమోదు అయిందట.
అయితే ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ వంశీని పరామర్శించేందుకు వెళ్లబోతున్నారనే టాక్ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నో ఏళ్లుగా జూనియర్ ఎన్టీఆర్, వంశీ మంచి స్నేహితులను సంగతి తెలిసిందే. టిడిపి ఆధ్వర్యంలోనే కూటమి ప్రభుత్వం లోనే వంశీ పైన కేసు నమోదు కావడం చేయడంతో పాటు జైలుకు పంపడంతో జూనియర్ ఎన్టీఆర్ వంశీని పరామర్శించడానికి వెళ్ళబోతున్నారనే విషయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ఈ విషయంపై ఎన్టీఆర్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ కేసులలో ఇరికించడంతో ప్రత్యేకమైన న్యాయవాదులతో సైతం బెయిల్ పిటిషన్ ని కూడా దాఖలు చేయించారు. అయితే వంశీ మెడికల్ రిపోర్టుతో మరొక పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. అనారోగ్య పరిస్థితుల రీత్యా వైద్య సదుపాయాలు అందించాలని అలాగే ఇంటి నుంచి భోజన సదుపాయాలు అందించాలని కోరారట.