గత కొద్దిరోజుల నుంచి ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళ జరుగుతున్న సందర్భంగా సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీలు రాజకీయ నాయకులు అందరూ కూడా అక్కడికి వెళ్లి మరి పుణ్య స్థానం చేస్తూ ఉన్నారు. ఇటీవలే నారా లోకేష్ కుటుంబ సభ్యులు వెళ్లగా ఇప్పుడు తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దంపతులకు కూడా కుంభమేళాకు వెళ్లి మరి అక్కడ పుణ్యస్నానం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా గంగా నదికి పవన్ కళ్యాణ్ దంపతులు ప్రత్యేకమైన పూజలు సైతం చేయడమే కాకుండా పసుపు కుంకుమ తో పాటుగా హారతి ఇచ్చి గంగలో వదిలేసారట.


అలాగే బ్రాహ్మణులకు సైతం వస్త్ర దానం చేయడమే కాకుండా .. ఈ మహా కుంభమేళ నిర్వహించినందుకు యోగి ఆదిత్యనాథ్ సైతం తన తరఫునుంచి కృతజ్ఞతలు తెలియజేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక్కడికి రావాలన్నది తన ఎన్నో ఏళ్ల కళ అని ఆ అతిపెద్ద కోరిక ఈరోజు నెరవేరిందని నాకు ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందంటూ తెలిపారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే కూడా కుంభమేళాల భక్తుల ప్రవాహం సైతం రోజురోజుకి పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు.


సోమవారం రోజున ఏకంగా 1.35  కోట్ల మంది స్నానం చేస్తూ ఉన్నారట. ఇప్పటివరకు 55 కోట్లకు పైగా భక్తులు అక్కడ పుణ్యస్నానం చేసినట్లుగా అక్కడ నివేదికలు తెలియజేస్తున్నాయి. మహా కుంభమేళ నుంచి భక్తులు తమ ఇళ్లకు చేరుకోవడానికి కూడా ప్రత్యేకమైన రైలును కేంద్ర ప్రభుత్వం నడిపిస్తోంది. అలాగే మరొకవైపు కుంభమేళ మీదుగా ప్రతి గంటకు 8 కి పైగా విమానాలు కూడా ప్రయాణిస్తున్నాయట. మొత్తానికి కుంభమేళాకి వెళ్లాలని భక్తులకు సైతం అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటోంది. ఇటీవలే ఢిల్లీలో తొక్కిసలాట జరగడంతో ఒక్కసారిగా ప్రభుత్వం కూడా అలర్ట్ అయి ఇకమీదట అలాంటివి జరగకుండా ఉండడమే కాకుండా తొక్కిసలాటలు మరణించిన భక్తులకు సైతం 10 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: