
అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన.... వార్నింగ్ పై సోషల్ మీడియాలో... ట్రోలింగ్ జరుగుతుంది. విజయవాడ సెంట్రల్ జైలు బయటికి వచ్చిన తర్వాత పేపర్ పట్టుకొని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడంపై... కూటమి సోషల్ మీడియా ఒక ఆట ఆడుకుంటుంది. జగన్మోహన్ రెడ్డికి సొంతంగా మాట్లాడారాదని... ఎప్పుడు చూసినా పేపర్ పట్టుకొని కామెంట్స్ చేస్తుంటాడని... సెటైర్లు పెంచుతున్నారు కూటమినేతలు. పేపర్ పట్టుకుని కూడా జగన్మోహన్ రెడ్డికి మాట్లాడరాదని... చురకలాంటిస్తున్నారు.
ప్రతిపక్షంలో ఉండి... అసెంబ్లీకి రాకుండా.. బెంగళూరులో దాక్కున్నాడని ఎద్దేవా చేస్తోంది కూటమి సోషల్ మీడియా. ఇక వైసిపి నేతలు అరెస్టు అయితే తప్ప ఏపీకి జగన్ మోహన్ రెడ్డి రావడంలేదని.. మండిపడింది. ఇది ఇలా ఉండగా... వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత.. మరోసారి ఏపీకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా వల్లబనేని వంశీని పరామర్శించి... మీడియాతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి.
త్వరలోనే ఎన్నికలు వస్తాయని.. అప్పుడు కచ్చితంగా వైసీపీ గెలుస్తుందని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చక్ర వడ్డీతో అందరికీ తెలిస్తామని హెచ్చరించారు. ఎవరు.. కార్యకర్తలను అరెస్టు చేశారో వారందరినీ గుర్తుపెట్టుకుంటామని తెలిపారు జగన్మోహన్ రెడ్డి. తన సామాజిక వర్గానికి సంబంధించిన ఏ ఒక్క లీడర్ పైకి ఎదిగిన చంద్రబాబు అలాగే నారా లోకేష్ తొక్కి వేస్తానని గుర్తు చేశారు. అందుకే వల్లభనేని వంశీ, కొడాలి నాని, ఆ తర్వాత దేవినేనిని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే వల్లభనేని వంశీని అరెస్టు చేసినట్టు.. ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి.