
గన్నవరం నియోజకవర్గంలో నన్ను కాదనే వారు ఉన్నారా ? నా పేరు చెబితే గ్రామాలకు గ్రామాలే తరలివస్తాయి ? వాడు ఏమనుకుంటున్నాడు ( ప్రత్యర్థి నేత ) ఒక్కసారి గన్నవరం గ్రౌండ్ లోకి దిగితే తెలుస్తుంది .. నోటికి వచ్చింది మాట్లాడటం కాదు గన్నవరంలో ఏ పల్లె ని అడిగిన ఏ పేట ను అడిగిన వంశీ గురించి చెబుతారు నాకు ఏమైనా జరిగితే గన్నవరం గన్నవరం మొత్తం నిలబడుతుంది రెండేళ్ల కిందట అప్పటి ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు ఇవి. ప్రత్యతి పార్టీలోకి చేరిన అప్పటి వైసిపి నేత ప్రస్తుత టిడిపి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును ఉద్దేశించి వంశీ చేసిన వ్యాఖ్యలు ఇవి. కట్ చేస్తే ఆయన గత ఎన్నికల లో ఇదే గన్నవరం ప్రజల చేతిలో ఓడిపోయారు. ఏదో కాకతాళీయంగా కూటమి ప్రభంజనంలో ఓడిపోయారు అనుకున్నా అప్పటినుంచి వంశీ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు.
గన్నవరం తెరమీద కనిపించటం మానేశారు. ఓటమి తర్వాత వంశీని పట్టించుకునే వారు కరువయ్యారు. వంశీ కేవలం డబ్బాలు కొట్టుకోవడానికి ప్రవగల్బాలు పలకడానికి మాత్రమే సరిపోయాలని తేలిపోయింది. తాజాగా వంశీ అరెస్టు అయ్యారు. 14 రోజుల రిమాండ్ పై గన్నవరంలో ఒక్కరంటే ఒక్కరు కూడా అయ్యో అన్న వారే లేకుండా పోయారు. మరీ ముఖ్యంగా తాను అనుకున్న వైసిపి నాయకులు కూడా పెద్దగా స్పందించడం లేదు. గన్నవరం ప్రశాంతంగా తన పని తాను చేసుకుపోతుంది. వంశీ విషయంలో సామాన్య ప్రజలు ఎవరూ స్పందించడం లేదు. వంశీ అరెస్ట్ కు నిరసనగా ఎక్కడ ధర్నాకు పిలుపు నివ్వలేదు .. బంద్ పాటించలేదు. ఆయన సతీమణి పంకజశ్రీ బయటకు వచ్చి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసిన ఆమె విషయంలో సానుభూతి ఉన్న వంశీ విషయంలో ఎవ్వరు సానుభూతి చూపించడం లేదు. సో అధికారంలో ఉన్నప్పుడు నా అంతటివాడు లేడు అని విర్రవీగిన వంశీని ఇప్పుడు గన్నవరంలో దేఖే వాడే లేకుండా పోయాడు.