
ఎందుకు అంటే మిర్చి యార్డ్ గుంటూరులో ఉన్నటువంటి ఈ మిర్చి యార్డ్ గత ఏడాది వచ్చినటువంటి మిర్చీ దారాలలో సగం వస్తూ ఉన్నదట ఇప్పుడు.. దీంతో మిర్చి రైతులు సైతం విలువలాడుతూ ఉన్నారట. ప్రభుత్వం ధరల స్థిరీకరణ అనేటట్టుగా ఒక పేరుని పెట్టి గతంలో జగన్ ఇస్తానన్నారు ఇవ్వలేదు.. ఇప్పుడు చంద్రబాబు ఇస్తానన్నారు మర్చిపోయారు .. కానీ జగన్ అదృష్టం ఏమిటంటే గతంలో రేట్లు ఎక్కువగా వచ్చాయి.. అయితే ఇప్పుడు చంద్రబాబు మర్చిపోయిన సంగతిని గుర్తు చేయడానికి జగన్ వస్తానని చెప్పారు.
కానీ ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా ఎన్నికల సంఘం పరిమిషన్ కావాల్సి ఉంటుంది.. అయితే పోలీసులకు ఇప్పుడు ఎన్నికల నిబంధన ఉండడం చేత.. గుంటూరు కృష్ణా జిల్లాకు సంబంధించి ఎన్నికలు జరగాల్సి ఉన్నది.. కాబట్టి ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది.. రేపటి అజిటేషన్ వైసిపి అనౌన్స్మెంట్ చేస్తే.. వాటికి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు.. దీంతో మిర్చి యార్డ్ దగ్గర చేయాలనుకున్నటువంటి ఉద్యమం సైతం నిలిచిపోయినట్టుగా అయింది. దీంతో వైసిపి పార్టీ చేయాలనుకున్న ఈ ఉద్యమం కూడా ఆగిపోయిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ పార్టీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని సూపర్ సిక్స్ హామీలతో పాటుగా చాలా హామీలను నెరవేర్చలేదంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని కూటమి ప్రభుత్వం పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది.