మన దేశంలోని ప్రజలకు బంగారం అంటే ఎంత మమకారమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 70 సంవత్సరాల క్రితం 1955 సంవత్సరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 79 రూపాయలు కాగా ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 88000 రూపాయలకు అటూఇటుగా ఉంది. 70 ఏళ్లలో ఏకంగా బంగారం ధర వెయ్యి రెట్లు పెరిగింది. 2026 సంవత్సరం చివరినాటికి 10 గ్రాముల బంగారం ధర లక్ష మార్కును చేరుకోవడం పక్కా అని తెలుస్తోంది.
 
బంగారం ధర పెరగడానికి అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ విలువ కొంతమేర కారణం అయినప్పటికీ డిమాండ్ కు తగినంతగా సప్లై లేకపోవడం, బంగారం నిక్షేపాలను కలిగి ఉన్న దేశాలు తక్కువ సంఖ్యలో ఉండటం ఇందుకు కారణమని చెప్పవచ్చు. మన దేశంలోని కొన్ని ప్రాంతాలలో బంగారం నిక్షేపాలు ఉన్నా వాటి నుంచి బంగారంను వెలికితీయడానికి అయ్యే ఖర్చు కంటే తక్కువకే మార్కెట్ లో బంగారం ధర తక్కువగా ఉండటంతో ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేయడం లేదు.
 
బంగారంపై ప్రస్తుతం పెట్టుబడి పెట్టడం సురక్షితమేనా అనే ప్రశ్నకు సురక్షితం అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. గతేడాది ఆగష్టులో ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించిన సమయంలో 10 గ్రాముల బంగారం ధర 69,000 రూపాయలు కాగా కేవలం 6 నెలల వ్యవధిగా దాదాపుగా 20,000 రూపాయల ధర పెరిగింది. ఈ స్థాయిలో లాభాలు రియల్ ఎస్టేట్ లో మరెక్కడా రావని నిపుణులు చెబుతున్నారు.
 
సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు కూడా తమ చేతిలో తక్కువ మొత్తం డబ్బు ఉన్నా బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. మన దేశంలో ఆడపిల్లకు పెళ్లి చేసే సమయంలో కట్నంలో భాగంగా ఎక్కువ మొత్తంలో బంగారం ఇవ్వడం జరుగుతోంది. బంగారంపై పెట్టుబడులు పెడుతూ వెళ్లడం ద్వారా భవిష్యత్తులో బంగారం రేటు పెరిగినా ఇబ్బందులు ఉండవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp