బ్యాంకులు సైతం బంగారాన్ని సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తాయి. ప్రస్తుతం ఎస్బీఐలో 10 గ్రాముల బంగారానికి గరిష్టంగా 54,000 రూపాయల వరకు రుణంగా ఇస్తున్నాయి. తక్కువ సమయంలో బంగారం ద్వారా సులువుగా రుణం పొందే అవకాశం ఉండగా బంగారంపై వడ్డీ రేట్లు కూడా ఇతర రుణాలతో పోల్చి చూస్తే తక్కువగా ఉన్నాయి. మెజారిటీ బ్యాంకులలో వడ్డీ రేట్లు 7 శాతం నుంచి 10 శాతం మధ్యలో ఉన్నాయి.
 
బంగారం లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు కాబట్టి అక్షయ తృతీయ సమయంలో, పండుగల సమయంలో కూడా బంగారం కొనుగోలు చేయడానికి ఎక్కువమంది ఆసక్తి చూపిస్తారు. అక్షయ తృతీయ సమయంలో బంగారం కొనుగోలు చేస్తే కుటుంబానికి మంచి జరుగుతుందని భావించే వాళ్లు ఉన్నారు. ఆడపిల్లలు కమ్మలు, ముక్కుపుడక, గొలుసు, ఉంగరాలుగా బంగారం ఆభరణాలను ధరించడానికి ప్రాధాన్యత ఇస్తారు.
 
అదే సమయంలో బంగారం విషయంలో మోసాలు కూడా ఎక్కువగా జరుగుతాయి. నేటికీ 24 క్యారెట్ల బంగారం, 22 క్యారెట్ల బంగారం, 18 క్యారెట్లు, 14 క్యారెట్ల మధ్య తేడా తెలిసిన వాళ్లు చాలా తక్కువమంది ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో బంగారం దుకాణాలలో 22 క్యారెట్ల ఆభరణాలను విక్రయిస్తూ వాటికి 24 క్యారెట్ల బంగారం ఖరీదును లెక్కిస్తున్నారు.
 
బంగారు ఆభరణాలను తయారు చేయాలంటే రాగి, కాడ్మియం, ఇతర లోహాలను కచ్చితంగా వినియోగించాల్సి ఉంటుంది. అలా వినియోగిస్తే మాత్రమే బంగారు ఆభరణాలు దృఢంగా ఉంటాయి. గతంలో చెన్నైలోని ప్రముఖ బంగారు ఆభరణాల దుకాణాల ఆభరణాలకు సంబంధించి మోసాలు వెలుగులోకి వచ్చాయి. అందువల్ల జ్యూవెలరీ కొనుగోలు చేసే సమయంలో నమ్మకమైన వ్యాపారుల దగ్గర మాత్రమే కొనుగోలు చేయాలి.
 
బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను విడిపించుకున్న తర్వాత కూడా బంగారం క్వాలిటీని చెక్ చేసుకుంటే మంచిది. ఇందుకు సంబంధించిన మోసాలు సైతం తాజాగా వెలుగు చూశాయి. ఇతర దేశాలతో పోల్చి చూస్తే మన దేశ ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చుపిస్తున్నారు. అదే సమయంలో కొన్ని దేశాలతో పోల్చి చూస్తే మన దేశంలో బంగారం ధరలు ఎక్కువగా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: