మహా కుంభమేళ..150 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళకు ఇండియా నుంచి ఎంతోమంది భక్తులు తరలి వెళ్తున్నారు.. సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఎంతో సాంప్రదాయ బద్దంగా సాగే ఈ కుంభమేళలో స్నానాలు ఆచరిస్తే  ఎన్నో అనారోగ్య సమస్యలు తొలగడమే కాకుండా అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు. ఇప్పటికే యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరిగే ఈ కుంభమేళకు దేశంలోని సగం మంది ప్రజలు వెళ్లి వచ్చారు.. ఎంతో అపురూపమైనటు వంటి ఈ కుంభమేళకు దేశ, విదేశాల నుంచి కూడా ప్రజలు వస్తున్నారు.. ఇదే తరుణంలో మహా కుంభమేళకు తాజాగా పవన్ కళ్యాణ్ తన భార్య అన్నాలెజ్నోవాతో కలిసి  వెళ్లారు.. మరి ఇందులో విడ్డూరం ఏంటి అని చాలామంది అనుకుంటారు.. అయితే ఈ కుంభమేళకు పవన్ ఒక్కడు వెళితే ఏం విడ్డూరం ఉండేది కాదు. కానీ తన భార్య కూడా ఆయనతోపాటు కుంభమేళలో స్నానం చేయడం ప్రత్యేకమే అని చెప్పాలి.. 

ఎందుకంటే పవన్ కళ్యాణ్ భార్య అన్నాలెజ్నోవా    క్రిస్టియన్ మతానికి చెందినటువంటి అమ్మాయి.. అయితే క్రిస్టియన్ మత సాంప్రదాయం ప్రకారం కనీసం పువ్వులను కూడా పూజలో వాడరు. ముఖ్యంగా హిందువుల పూజలను, అలాగే  దేవాలయాలను చూడటానికి ఇష్టపడరు.. అంతేకాదు హిందువులు ఎక్కడైనా ప్రసాదం పెడితే కూడా తినడానికి వారు మొహమాటమే చూపిస్తారు.. అలా ఎంతో కట్టుదిట్టంగా ఉండే క్రిస్టియన్ మతస్తురాలైన  అన్నాలెజ్నోవా తన భర్త మీద గౌరవంతో కుంభమేళలో భర్తతో పాటు తాను కూడా  స్నానమాచరించడం  చాలా ప్రత్యేకం..అయితే ఈ ఘట్టంలో పవన్ కళ్యాణ్ జంజరం కూడా ధరించారు.. ఈ సందర్భంగా  పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ఎంతో చక్కగా హిందూ సాంప్రదాయం గురించి వివరించారు.. మొత్తానికి వేల సంవత్సరాలుగా కుంభమేళ జరుగుతున్నట్టు చరిత్ర చెబుతోంది అన్నారు..

 ఈ కుంభమేళకు రావడం నాకు చాలా ఆనందంగా ఉందంటూ అన్నారు.. భారతీయులంతా భిన్న జాతులు, తెగలు, సాంప్రదాయాలను ఆచరిస్తున్న సనాతన ధర్మం విషయంలో మాత్రం అంతా ఒక్కటవ్వడం చాలా ఆనందం.. వేల ఏళ్లుగా సనాతన ధర్మం వర్ధిల్లుతోంది.. ఇది ఇలాగే తరతరాలు కొనసాగాలని కోరుకుంటున్నాను అన్నారు.. ప్రపంచంలోనే ఇలాంటి మహా కార్యక్రమం ఎక్కడ జరగలేదని తెలియజేశారు.. ఇలాంటి సనాతన ధర్మం గురించి కొంతమంది నేతలు ఇష్టానుసారంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదని ఆయన హెచ్చరించారు.. ఇక పవన్ కళ్యాణ్ అన్నా లెజ్నోవా తో పాటు పవన్ తనయుడు అకిరా నందన్,డైరెక్టర్ త్రివిక్రమ్ లు కూడా మహా కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: